విజయా రెడ్డి వాగ్వాదం, తలసాని అసహనం! టిడిపి ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్న నాయిని

హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలోనే టిఆర్ఎస్ నేతల మధ్య సోమవారం నాడు వాగ్వాదం చోటు చేసుకుంది. తలసాని సమక్షంలో గోవర్ధన్ రెడ్డి, విజయా రెడ్డి వర్గగాల మధ్య వాగ్వాదం జరగగా.. తలసాని వారికి సర్ది చెప్పారు.

బంజారాహిల్స్ బీటీ రోడ్డు ప్రారంభోత్సవానికి మంత్రి తలసాని వచ్చారు. ఆయన సమక్షంలో విజయా రెడ్డి, గోవర్ధన్ వర్గాలు ఒక్కసారిగా గొడవకు దిగాయి. తోపులాట కూడా జరిగింది. పోలీసులు కలుగజేసుకుని ఎంత నచ్చజెప్పినా రెండు వర్గాలు వినలేదు.

దీంతో అక్కడే ఉండి ఇదంతా గమనిస్తున్న మంత్రి తలసాని అసహనం వ్యక్తం చేసి ఇరు వర్గాలను హెచ్చరించి వెళ్లిపోయారు. దాంతో గొడవ కొంత సర్దుమణిగింది. అయితే విజయా రెడ్డి, మన్నె గోవర్ధన్ రెడ్డి వర్గాలు గతంలో కూడా ఇలాగే బాహాబాహీకి దిగాయి.

War of words between two groups in TRS

టిడిపి ఎమ్మెల్యే గాంధీ ప్రసంగం అడ్డుకున్న నాయిని

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాంధీ ప్రసంగాన్ని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం అడ్డుకున్నారు. జిహెచ్ఎంసీ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం రసాభాసగా మారింది.

సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు కోరినా కమిషనర్ చర్యలు తీసుకోవడం లేదని, రెసిడెన్షియల్ వెల్ఫేర్ పైకి నెట్టి చేతులు దులుపుకోవద్దని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఆయన ప్రసంగాన్ని మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అడ్డుకున్నారు. ఆ సమయంలో టిఆర్ఎస్ కార్యకర్తలు... పక్క రాష్ట్ర పార్టీ కుట్ర అంటూ నినాదాలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+