వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్త్ సిటీగా వరంగల్ .. మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి 1,100 కోట్ల పరిపాలన అనుమతి; ఎర్రబెల్లి హర్షం

|
Google Oneindia TeluguNews

తెలంగాణకే తలమానికం అయిన ఓరుగల్లు నగరం హెల్త్ హబ్ గా రూపుదిద్దుకోనుందా? సీఎం కేసీఆర్ ఓరుగల్లు నగరం పై ప్రత్యేకమైన దృష్టి సారించి హెల్త్ సిటీ ఏర్పాటు చేస్తానని చేసిన ప్రకటనకు అడుగులు పడుతున్నాయా? వరంగల్ నగరాభివృద్ధిపై తెలంగాణా సర్కార్ ఫోకస్ చేస్తుందా ? అంటే అవుననే సమాధానమే వస్తోంది.

వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర నకిలీ వెహికల్ ఇన్సూరెన్సులు చేస్తున్న ముఠా అరెస్ట్ .. వీళ్ళ దందా చూసి పోలీసులే షాక్!వరంగల్ ఆర్టీఏ ఆఫీస్ దగ్గర నకిలీ వెహికల్ ఇన్సూరెన్సులు చేస్తున్న ముఠా అరెస్ట్ .. వీళ్ళ దందా చూసి పోలీసులే షాక్!

సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణానికి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు

సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణానికి 1100 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు

వరంగల్ జిల్లాలో హెల్త్ సిటీ ఏర్పాటులో భాగంగా వరంగల్ కేంద్ర కారాగారంలో నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన జీవో విడుదలైంది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి 1,100 కోట్ల రూపాయలు పరిపాలన అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏ ఎం రిజ్వీ జీవో 158ని జారీ చేశారు. ఇక ఈ జీవోలో సివిల్ వర్క్ ల కోసం 509 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనులకోసం 182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం 105 కోట్లు, అనుబంధ పనుల కోసం 54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం 229 .18 కోట్లు, పారిశుద్ధ్యం కోసం 20.36 కోట్లు నిధులకు అనుమతులు ఇచ్చారు. టిఎస్ ఎంఎస్ఐడిసి, డీఎంఈ ఆధ్వర్యంలో వెంటనే పనులు చేపట్టాలని రిజ్వీ ఆ జీవోలో ఆదేశించారు.

33 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి జూన్ లో కేసీఆర్ శంకుస్థాపన

33 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి జూన్ లో కేసీఆర్ శంకుస్థాపన

15 ఎకరాల్లో 11 వందల కోట్లతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలకు అనుమతి మంజూరు చేస్తూ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ముప్పై మూడు అంతస్తులలో భారీ భవన సముదాయాన్ని నిర్మించనుంది . 2000 పడకలు ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. సూపర్ స్పెషాలిటీ కోసం 800 పడకలు ఏర్పాటు చేయనున్నారు. 33 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి జూన్ 21వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని, నిధులు కూడా మంజూరు చేశారని, సీఎం కేసీఆర్ కు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు

ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మరింత వేగంగా పనులు పూర్తి చేస్తారని, హరీష్ రావు కు వైద్య ఆరోగ్య శాఖ అప్పగించడం వల్ల పనుల్లో వేగం ఉంటుందని భావిస్తున్నానని, అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు సైతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వరంగల్ అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న కేసీఆర్కు కృతజ్ఞతలు అంటూ ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఓరుగల్లు ప్రజల తరఫున కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.

టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు మొదలు పెడతామన్న మంత్రి ఎర్రబెల్లి

టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు మొదలు పెడతామన్న మంత్రి ఎర్రబెల్లి

సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభించి వెంటనే పనులు ప్రారంభిస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. వరంగల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగితే హైదరాబాద్లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై భారం తగ్గుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే హైదరాబాద్ స్థాయిలో అద్భుతమైన వైద్యం వరంగల్లోనే అందుతుందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. మాట తప్పని మడమ తిప్పని ప్రభుత్వం కేసీఆర్ దని మరోసారి రుజువైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కెసిఆర్ పాలనకు కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా, వైద్య అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో దేశంలోనే అగ్రగామిగా ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు

English summary
The Telangana govt on Saturday issued an administrative sanction of Rs 1,100 crore for the construction of a super-specialty hospital at the Waranga as part of the establishment of a health city in Warangal district. Minister Errabelli was elated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X