వరంగల్ భ‌ద్ర‌కాళి చెరువుకు గండి.. దూసుకొస్తున్న వరదనీరు; ముంపు భయంలో కాలనీలు!!

వరంగల్ జిల్లాను ఇంకా వరద ముంపు భయ పెడుతూనే ఉంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వందల కాలనీలు ముంపుకు గురై వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు కాగా, ప్రస్తుతం నిండు కుండలని తలపిస్తున్న చెరువులు ఉప్పొంగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ జిల్లావ్యాప్తంగా చెరువులన్నీ మత్తడి పడి ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది.

ఇదిలా ఉంటే వరంగల్ నగరంలో నేడు భద్రకాళి చెరువుకు పోతన నగర్ ప్రాంతంలో గండి పడింది. దీంతో ప్రమాదంలో పోతననగర్, సరస్వతి టెంపుల్, అయ్యప్ప ఆలయం, కాపువాడ ప్రాంతాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతికి పోతన నగర్ వైపు చెరువు కట్ట కోతకు గురైన కారణంగా ప్రస్తుతం భారీగా నీరు కాలనీలలోకి చేరుకుంటుంది.

bhadrakalipondoverflowed1

భద్రకాళి చెరువు కట్టకు గండి పడటంతో అధికారులు భద్రకాళీ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలను ఇల్లు ఖాళీ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. అంతేకాదు అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గండి పూడ్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

భద్రకాళి చెరువు కట్ట సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అంతేకాదు భద్రకాళి చెరువు మత్తడి వైపు మరొక బుంగ పడినట్లుగా ప్రస్తుతం తెలుస్తోంది. ఇప్పటికే గొద్ది రోజులుగా వర్షాలు, వరదలతో తీవ్ర ఆందోళనలో ఉన్న ప్రజలు కాస్త వర్షం తగ్గటం తో ఉపశమనం పొందుతున్నారు అంటే మళ్ళీ భద్రకాళీ చెరువుకు గండి పడటం ఇప్పుడు మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది.

bhadrakalipondoverflowed1

అధికారులు ఇప్పటికే ఆ ప్రాంతంలో వరద నీరు ముంచెత్తే అవకాశం ఉన్న నేపధ్యంలో ట్రాఫిక్ ను మళ్ళించారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. చెరువుకు పడిన గండిని పూడ్చే ప్రయత్నం చేస్తున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికిన చర్యలు చేపట్టారు. ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా తో పాటు అధికారులు భద్రకాళి చెరువుకు గండి పడిన ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. సామర్థ్యానికి మించి నీరు రావడంతోనే చెరువు కట్ట తెగిపోయిందని, గండి పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నామని వరంగల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+