బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్; ప్రకటించిన కేసీఆర్!!

బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎంపికపైన సుదీర్ఘ చర్చల తర్వాత ఒక క్లారిటీ కి వచ్చి ఫైనల్ గా అభ్యర్థిని ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ అనూహ్యంగా తెరమీదకు ఊహించని వ్యక్తిని తీసుకువచ్చి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు.

వరంగల్ ఎంపీ అభ్యర్థి తాటికొండ రాజయ్య కాదు
కడియం కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను ఉండబోనని కెసిఆర్ కు లేఖ రాసి పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న పేరు, అలాగే స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పేరు అధినేత పరిశీలిస్తున్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా తాటికొండ రాజయ్య పేరును ఖరారు చేసినట్టుగా కూడా వార్తలు వచ్చాయి.

Warangal BRS MP candidate Dr Marepalli Sudheer Kumar KCR announced

అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్
అయితే ఎవరూ ఊహించని విధంగా, ఎవరు ఊహించని వ్యక్తికి బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్. మారేపల్లి సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ కు ఎంపీ అభ్యర్థిగా అవకాశం
హన్మకొండ జిల్లా వాసి,మాదిగ సామాజికవర్గానికి చెందిన డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను అభ్యర్థిగా ఎంపిక చేసిన కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్యుల ఏకగ్రీవ ఆమోదంతోనే ఎంపిక చేసినట్టు సమాచారం. 2001 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా కీలక భూమిక పోషించిన ఆయన, పార్టీకి విధేయుడిగా పనిచేశాడు.

కేసీఆర్ ప్రకటనతో రంగంలోకి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్
ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న బిజెపి అభ్యర్థి ఆరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యలను దీటుగా ఎదుర్కోవాలంటే మారేపల్లి సుధీర్ కుమార్ తోనే సాధ్యం అవుతుంది అని భావించి అభ్యర్థిగా కెసిఆర్ ప్రకటించారు. అనేక తర్జనభర్జనల మధ్య, ఊహించని రాజకీయ పరిణామాల మధ్య మారేపల్లి సుధీర్ కుమార్ ఎంపిక జరిగింది. కెసిఆర్ ప్రకటనతో అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ వరంగల్ ఎంపీ బరిలో అమీ తుమీ తేల్చుకోబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+