Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వరంగల్ తూర్పు గులాబీల రగడ: అధిపత్య పోరులో నువ్వా నేనా; హాట్ టాపిక్!!

వరంగల్ టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య గ్రూప్ వార్ టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పార్టీ శ్రేణులకు తలనొప్పిగా మారింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం వర్గంలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. స్థానికంగా పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఒకరినొకరు నిలువరించే ఎత్తుగడలు వేస్తుండటం పార్టీ శ్రేణులకు పెద్ద ఇబ్బందిగా మారింది.

వరంగల్ తూర్పు నేతల మధ్య వర్గ పోరు

వరంగల్ తూర్పు నేతల మధ్య వర్గ పోరు

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య గొడవలు ముదిరాయి. ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో గతంలో పనిచేసిన బస్వరాజు సారయ్య, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసి ప్రస్తుతం మేయర్ గా కొనసాగుతున్న గుండు సుధారాణి, మాజీ మేయర్ వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, నన్నపునేని నరేందర్ మధ్య అభిప్రాయభేదాలు అనేక సందర్భాల్లో బహిర్గతం అవుతున్నాయి. గతంలో దసరా వేదికగా ఓరుగల్లు అధికార పార్టీలో వర్గపోరు రచ్చకెక్కింది. ఉర్సు రంగలీలా మైదానం వేదికగా తూర్పు నియోజకవర్గ పెద్దల మధ్య అభిప్రాయభేదాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి.

ఎమ్మెల్యే నరేందర్ వర్సెస్ మేయర్ గుండు సుధారాణి

ఎమ్మెల్యే నరేందర్ వర్సెస్ మేయర్ గుండు సుధారాణి

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలు పార్టీ నేతల్లోని లుకలుకలను బయట పెడుతున్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్టుగా ప్రస్తుతం పరిస్థితి తయారైంది. తూర్పు నియోజకవర్గంలో గతంలో కలిసి పనిచేసిన ఎమ్మెల్యే నరేందర్, గుండు సుధారాణి ల మధ్య సఖ్యత కొరవడింది. సుధారాణి మేయర్ అయిన తర్వాత నరేందర్ ఆమెకు సహకరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇక మేయర్ గుండు సుధారాణి కూడా నరేందర్ అనుచరులైన కొంతమంది కార్పొరేటర్ల డివిజన్లలో వారికి సమాచారం ఇవ్వకుండానే పర్యటిస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది.

బస్వరాజు సారయ్య కూడా పట్టు కోసం యత్నాలు

బస్వరాజు సారయ్య కూడా పట్టు కోసం యత్నాలు

నరేందర్ కు దగ్గరగా ఉండే కార్పొరేటర్ల పనుల విషయంలో శ్రద్ధ చూపటం లేదని తెలుస్తుంది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు కోసం ప్రయత్నాలు చేసిన ఇరువురు నేతల మధ్య తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించడంలో, నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి ప్రస్తుతం ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య ధోరణి కొనసాగుతుందన్న టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసి, మంత్రిగా జిల్లా రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన బస్వరాజు సారయ్యకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో, నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవడం కోసం ఆయన తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకరంటే ఒకరికి పడని తీరు.. ఒకరి వ్యూహాలకు మరొకరు చెక్

ఒకరంటే ఒకరికి పడని తీరు.. ఒకరి వ్యూహాలకు మరొకరు చెక్

బస్వరాజు సారయ్య నిలువరించడానికి, నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పట్టు నిలుపుకోవడానికి నరేందర్ అష్టకష్టాలు పడుతున్నట్టు సమాచారం. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేస్తున్న గుండు సుధారాణి వరంగల్ తూర్పు నియోజకవర్గం పై పట్టు కోసం దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు వరంగల్ తూర్పు రాజకీయాలపై ప్రభావం చూపిన బస్వరాజు సారయ్య గులాబీ గూటికి చేరిన తరువాత ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు. తాజా ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ వరంగల్ తూర్పు నియోజకవర్గం తన చేతి నుండి చేజారి పోకుండా బస్వరాజు సారయ్యను, గుండు సుధారాణినీ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక తాజాగా బండా ప్రకాష్ ఎంట్రీ, దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా

ఇక తాజాగా బండా ప్రకాష్ ఎంట్రీ, దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కూడా

స్థానిక కార్యక్రమాలలో ఎవరికి వారు విడివిడిగా పాల్గొంటున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలలోనూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈ సమయంలో తూర్పు నియోజకవర్గం లోనే మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండ ప్రకాష్, ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో తూర్పు రాజకీయాలపై తన ముద్ర వేయాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక జిల్లా మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు సైతం వరంగల్ తూర్పు రాజకీయాలలో పాగా వేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ టిక్కెట్ రేసులో కూడా ఎర్రబెల్లి ప్రదీప్ రావు ఉన్నారు. మంత్రిగా ఉన్న సోదరుడి సహకారంతో తూర్పు రాజకీయాలపై పట్టు కోసం ఎర్రబెల్లి ప్రదీప్ రావు ప్రయత్నాలు చేస్తున్నాడు.

 వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరులో నలిగిపోతున్న కార్యకర్తలు, అధికారులు

వరంగల్ తూర్పులో ఆధిపత్య పోరులో నలిగిపోతున్న కార్యకర్తలు, అధికారులు

వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని నేతల మధ్య ఆధిపత్య పోరు తో అటు కార్యకర్తలు మాత్రమే కాదు అధికారులు సైతం నలిగిపోతున్నారు. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైన నియోజకవర్గంలోని పరిస్థితి అధికారులకు తలనొప్పిగా మారింది.వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు పై స్థానికంగా చర్చ జరుగుతోంది. తూర్పు నియోజకవర్గంలో ఇది కామన్ అన్న చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా కొండా సురేఖ ఉన్న సమయంలో కూడా తూర్పు రాజకీయాలు రచ్చకెక్కాయి. ప్రస్తుతం మళ్లీ అవే కొనసాగుతున్నాయి అన్న టాక్ వినిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+