చదివింది ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్.. చేసేది చోరీలు; ఏం పనిరా నాయనా!!

అతడు ఉన్నత చదువులు చదువుకున్నాడు. కంప్యూటర్ సైన్స్ లో ఎమ్మెస్సీ చేశాడు. అంత బాగా చదువుకొని దొంగగా మారిన సదరు పోస్ట్ గ్రాడ్యుయేట్ వరంగల్ కమిషనరేట్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఇక ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ దొంగగా ఎందుకు మారాడు? అసలు ఎలా చోరీలకు పాల్పడ్డాడు వంటి వివరాలలోకి వెళితే..

మహబూబాబాద్ జిల్లా గంగవరం మండలం పెద్ద ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ఎర్రబోతుల సునీల్ ప్రస్తుతం హన్మకొండలోని జూలై వాడలో నివాసముంటున్నాడు. నిందితుడు సునీల్ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తిచేసి ఆన్ లైన్ లో క్రికెట్ తో పాటు, ఇతర క్రీడలపై బెట్టింగ్ లకు పాల్పడుతూ ఉండేవాడు. చెడు వ్యసనాలకు బానిసైన సునీల్ బెట్టింగ్ ల తో పాటు, చెడు వ్యసనాలతో చాలా డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యాడు.

 chainsnaching

దీంతో తిరిగి ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఆలోచించుకుని దీని కోసం మరో నిందితుడితో కలిసి చోరీలు చేసేందుకు రెడీ అయ్యాడు. 2020 సంవత్సరంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, ధర్మసాగర్ , మట్టెవాడ, కేయుసి, ఆలేరు పోలీస్ స్టేషన్ల పరిధిలో 15కు పైగా చోరీలకు పాల్పడ్డాడు. 2022 సంవత్సరంలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించడంతో పాటు, సుబేదారి పోలీసులు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు.

అయితే గత ఏడాది అక్టోబరు నెలలో జైలు నుంచి విడుదలైన నిందితులు మళ్లీ బెట్టింగుల కోసం చోరీలు చేయడానికి రెడీ అయ్యాడు. కొద్ది రోజులుగా ఒక కార్ డ్రైవర్ గా పనిచేసి, యజమానికి చెందిన టూవీలర్ ల పైన కాలనీలలో తిరుగుతూ, తాళం వేసి ఉన్న ఇళ్ళను గుర్తించి పక్కా ప్లాన్ తో దొంగతనాలకు పాల్పడ్డాడు.

కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో వడ్డేపల్లిలో పరిమళకాలనీలో చోరీకి పాల్పడగా, ఈ నెల 12వ తేదిన కోమటిపల్లి పోలీస్ కాలనీలో తాళాలు పగులగోట్టి చోరీకి పాల్పడి విలువైన బంగారు అభరణాలను చోరీ చేసాడు. ఈ చోరీలపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ అదేశాల మేరకు సిసిఎస్ మరియు కెయూసి పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడుని గుర్తించారు.

 chainsnaching

నిందితుడు ఈరోజు కేయూసి జంక్షన్ ప్రాంతంలో తిరుగుతున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో నిందితుడిని పోలీసులు అదుపులో విచారించగా నిందితుడు పాల్పడిన చోరీలను అంగీకరించారు. నిందితుడి నుండి సుమారు 11లక్షల 50వేల రూపాయల విలువైన 192 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్ళు, ఒక సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డిసిపి మురళీధర్ వివరాలను వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+