శ్రుతిపై రేప్ జరగలేదు: వరవరరావుపై ఎస్పీ మండిపాటు
వరంగల్: వరంగల్ ఎదురుకాల్పుల ఘటనపై విప్లవ రచయితల సంఘం (విరసం) నేతల వ్యాఖ్యలను వరంగల్ జిల్లా రూరల్ ఎస్పీ అంబర్‌కిశోర్ ఝూ ఖండించారు. అసత్యాలు, వక్రీకరణలతో విరసం నైజం బయటపడిందని ఆయన శుక్రవారంనాడు విమర్శించారు.
ఎదురుకాల్పులపై విరసం నేత వరవరరావు చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని ఆయన అన్నారు. మొదట కాల్పులు జరిపింది మావోయిస్టులేనని, ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరిపారని ఆయన స్పష్టం చేశారు.

మావోయిస్టు శ్రుతిపై అత్యాచారం గానీ వేధింపులు గానీ జరగలేదని ఆయన చెప్పారు జాతీయ మానవహక్కుల కమిషన్ నిబంధనల మేరకే శవ పరీక్ష జరిపామని వెల్లడించారు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలని ఎస్పీ కోరారు.
మావోయిస్టు శ్రుతిపై అత్యాచారం చేశారని, తీవ్రంగా వేధించారని, ఆమె ఒంటిపై గాయాలున్నాయని విరసం నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ నేత సీతక్క ఆరోపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications