వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభంపై కీలక అప్డేట్!

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ పై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. దసరా నాటికే ఓపీ సేవల సాఫ్ట్ లాంచ్ ప్రారంభించాలని భావించగా, పనులు పూర్తికాక మళ్ళీ వాయిదా పడిన విషయం తెలిసిందే అయితే తాజాగా మరోమారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులపై, ఓపీ సేవల ప్రారంభంపై క్లారిటీ వచ్చింది.

తాజాగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పెండింగ్‌ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌‌ అండ్ బీ, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించేందుకు హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ మేరకు టిమ్స్ అల్వాల్, టిమ్స్ ఎల్‌బీ నగర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి సమీక్ష చేశారు.

Warangal Super Specialty Hospital OP Services Infrastructure and 6 Operation Theatres to be Ready by November 15

ఇటీవల జరిగిన సమావేశంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో హాస్పిటల్‌లో ప్రతి ఫ్లోర్ ప్లాన్‌ను మంత్రి పరిశీలించారు. తొలుత అవుట్‌ పేషెంట్ వైద్య సేవలు ప్రారంభించనున్న నేపథ్యంలో, ఇందుకు అవసరమైన రిజిస్ట్రేషన్ డెస్క్‌లు, ఓపీ కన్సల్టేషన్‌ రూమ్‌లు, ఫార్మసీ, డయాగ్నస్టిక్స్‌ తదితర సేవలకు సంబంధించిన పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.

ఈ నెల 15వ తేదీ నాటికి అవుట్ పేషెంట్ సేవలకు సంబంధించిన అన్ని పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. 6 ఆపరేషన్ థియేటర్లు సైతం సిద్ధమవుతాయని తెలిపారు. ఒక్కసారి పేషెంట్‌ హాస్పిటల్‌కు వచ్చాక, మరో హాస్పిటల్‌కు రిఫర్ చేసే ప్రసక్తే ఉండకూడదని, అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా హాస్పిటల్‌లో సౌకర్యాలు ఉండాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వం నియమించిన డాక్టర్ల బృందం వరంగల్ హాస్పిటల్‌, అల్వాల్, కొత్తపేట టిమ్స్‌ హాస్పిటళ్లను రెగ్యులర్‌‌గా విజిట్ చేయాలని మంత్రి ఆదేశించారు. అల్వాల్ టిమ్స్‌ పనులు సైతం చివరి దశలో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు.

రూ.10వేల కోట్ల పెట్టుబడులు అంచనా.. క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు క్యాబినెట్ ఆమోదం!
రూ.10వేల కోట్ల పెట్టుబడులు అంచనా.. క్యాపెక్స్ సపోర్ట్ స్కీమ్‌కు క్యాబినెట్ ఆమోదం!

ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్‌ జరుగుతోందని తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎల్‌బీ నగర్ టిమ్స్ పనులు చివర దశకు వస్తాయని అధికారులు తెలిపారు. పనులన్నీ స్పీడప్ చేయాలని, వీలైనంత త్వరగా హాస్పిటళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+