తెలంగాణా సంస్థకు కేంద్రం మరో అరుదైన గుర్తింపు.. 'మేనేజ్' హైదరాబాద్‌ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్!

హైదరాబాద్ లోని జాతీయ వ్యవసాయ విస్తరణ నిర్వహణ సంస్థ మేనేజ్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి మరో గొప్ప గుర్తింపు లభించింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామికవేత్తల మంత్రిత్వ శాఖ ఎంఎస్‌డీఈ వ్యవసాయ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్-స్కిల్స్ గా ఈ సంస్థను గుర్తించింది. నవంబర్ 2న ఢిల్లీలోని కౌశల్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, మేనేజ్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ అగర్వాల్‌కు గుర్తింపు పత్రాన్ని అందజేశారు.

ఈ గుర్తింపు మూడేళ్లపాటు అమల్లో ఉంటుంది. 1987లో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన మేనేజ్ దేశంలో వ్యవసాయ విస్తరణ వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. రాజేంద్రనగర్‌లో ఉన్న ఈ సంస్థ శిక్షణ, కన్సల్టెన్సీ, పరిశోధన, విద్యా కార్యక్రమాలు, సమాచార సేవలు అందిస్తోంది. అగ్రి-బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా పీజీడీఎం-ఏబీఎం, వ్యవసాయ విస్తరణ నిర్వహణలో పీజీ డిప్లొమా వంటి కోర్సులు నిర్వహిస్తోంది.

MANAGE Hyderabad Recognised as Centre of Excellence for Skills in Agriculture by Ministry of Skill Development

అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి-బిజినెస్ సెంటర్స్ పథకం, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ వంటి జాతీయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తోంది.ఈ గుర్తింపు వ్యవసాయ రంగంలో నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలను విస్తరించడానికి, సంస్థాగత సామర్థ్యాలను పెంపొందించడానికి, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దోహదపడుతుందని మేనేజ్ డీజీ సంజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు.

ప్రభుత్వం నైపుణ్యం కలిగిన, సామర్థ్యం గల, వ్యవసాయ వ్యాపారవేత్తలను తీర్చిదిద్దాలనే దృష్టితో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ గుర్తింపు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యవసాయ వృత్తి నిపుణులు, యువ వ్యాపారవేత్తలకు అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం అందించేందుకు మేనేజ్ ఇప్పటికే విస్తృతంగా పనిచేస్తోంది.మేనేజ్ ప్రతిపాదనను డీజీ సంజయ్ కుమార్ అగర్వాల్, డైరెక్టర్ శైలేంద్రతో పాటు ఇతర అధికారుల బృందం రూపొందించింది.

తెలంగాణకు కేంద్రం తీపికబురు..రూ. 3892కోట్ల భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణకు కేంద్రం తీపికబురు..రూ. 3892కోట్ల భారీ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్!

ఈ గుర్తింపు సంస్థకు మైలురాయిగా నిలుస్తుందని, వ్యవసాయ రంగంలో నైపుణ్యాభివృద్ధి, కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా రైతులకు, విస్తరణ అధికారులకు, వ్యవసాయ వ్యాపారులకు మెరుగైన శిక్షణ, మార్గదర్శకత్వం అందించేందుకు ఈ గుర్తింపు కొత్త అవకాశాలు తెరుస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+