విద్యార్థులకు హెచ్చరిక.. అలా చేస్తే క్రిమినల్ కేసులు!
విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ లాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పోలీసులు పదేపదే చెప్తున్నారు. తాజాగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ర్యాగింగ్ విషయంలో విద్యార్థులను హెచ్చరించారు. త్వరలో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న తరుణంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన చేశారు.
విద్యా సంస్థల్లో ర్యాగింగ్.. వారికి హెచ్చరిక
విద్యా సంస్థలలో ర్యాగింగ్‌కు పాల్పడటం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుందని ఈ చర్యల ద్వారా విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా సీనియర్ల ముసుగులో జూనియర్ విద్యార్థుల పట్ల అసాంఘిక కృత్యాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తూ విద్యాసంస్థల నుండి తొలగించడంతో పాటు ర్యాగింగ్ లాంటి చర్యలకు పాల్పడే విద్యార్థులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఆ పని చేస్తే విద్యా, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం
దీనితో ర్యాగింగ్ పాల్పడిన విద్యార్థుల విద్యా, ఉద్యోగ, భవిష్యత్తు అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. అలాగే విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకై యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి వుంటుందని, ఇందులో భాగంగా ప్రతి ఉన్నత విద్యా సంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలు స్వ్కాడ్‌లను ఏర్పాటు చేయాలని, నూతనంగా వచ్చిన విద్యార్థుల కోసం ప్రత్యేక పరివేక్షణ వుండాలన్నారు.
విద్యార్థుల ఫిర్యాదుకు హెల్ప్ లైన్ నంబర్లు
ముఖ్యంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలతో పాటు సెమినార్లు, వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలని సూచించారు. విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకుగాను 24గంటల హైల్ప్‌లైన్ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో వుంచాలని. విద్యార్థులు సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని. ఎవరైన ర్యాగింగ్‌కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్, యాజమాన్యం లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
ఆ సంస్కృతి పూర్తిగా నిర్మూలించాలంటే ఇలా చెయ్యాలి
ర్యాగింగ్‌కు పాల్పడం ద్వారా విద్యా భవిష్యత్తు నాశనం అవుతుందని, ప్రతి ఒక్క విద్యార్థి గుర్తుంచుకోవాలని పోలీస్ కమిషనర్ సూచిస్తూ. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. కావున విద్యా సంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విధ్యార్థులు పోలీసులు కలిసి పనిచేసిప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలుతామని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications