వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ఆ ప్రకటనలు అవాస్తవం, రేవంత్‌తో మేం వెళ్ళడం లేదు'

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టిడిపి తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వెంట తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలను హైద్రాబాద్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎం.ఎన్. శ్రీనివాస్‌రావు ఖండించారు.

Recommended Video

Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

అట్టడుగు వర్గాల ప్రజల సంక్షేమానికి, రాజ్యాధికారాన్ని అందించాలన్న గొప్ప సంకల్పంతో స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నిస్వార్థపరులైన నాయకులు ఎప్పటికీ కొనసాగుతారని ఎంఎన్ శ్రీనివాస్ చెప్పారు.

వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?వెల్‌కమ్ వ్యూహం: వైఎస్ అప్పుడలా, కెసిఆర్ ధీమా అదేనా?

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్నారు. కానీ తనతో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని రేవంత్‌రెడ్డి పలువురు టిడిపి నేతల పేర్లను ప్రకటించటం బాధాకరంగా ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మొత్తం ప్రపంచ దృష్టినే ఆకర్షించిందని ఆయన గుర్తు చేశారు.

We are continuing in TDP says Hyderabad city leaders

పార్టీకి పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమైన సమయంలో ఇలాంటి పరిణామాలు జరగటం దురదృష్టకరమని ఆయన చెప్పారు. ఇలాంటి ఎన్ని సంఘటననలు జరిగినా నగర టిడిపి కమిటీ నేతలంతా నిస్వార్థంగా పార్టీ బలోపేతం చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.ఇతర పార్టీల్లోకి చేరితే తమకు పదవులోస్తాయేమోనన్న ఆశ తమకు లేదని ఆయన స్పష్టం చేశారు

టిడిపి తెలంగాణ బిసి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్ మాత్రం తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది టిడిపితోనేనని, బతికున్నంత కాలం టిడిపిలోనే కొనసాగుతానని కూన వెంకటేష్ ‌గౌడ్ తేల్చి చెప్పారు.

చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్చంద్రబాబుపై తిరుగుబాటు: అప్పుడు నాగం, ఇప్పుడు రేవంత్

తెలంగాణలో టిడిపి అధికారంలోకి వచ్చినా రాకపోయినా తాను ఎప్పటికీ టిడిపిలోనే ఉంటానని తెలంగాణ టిడిపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎల్. దీపక్‌రెడ్డి చెప్పారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న అభివృద్ధిని చూసి తెలంగాణ ప్రజలు కూడా స్వచ్ఛందంగా టిడిపికే అధికారాన్ని కట్టబెట్టేందుకు ఎదురుచూస్తున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

English summary
Hyderabad city Tdp leaders condemned rumours on join in Congress with Revanth Reddy.Hyderabad cith leaders spoke to media on Monday at Hyderabad party office
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X