వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుల‌ కోసం రాజీనామాల‌కు సిద్ధం ..! టీఆర్ఎస్ ఎంపీలు రెడీనా !?.. : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి స‌వాల్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి. అధికార టీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ట్విట్టర్ యుద్ధం నడుస్తోంది. రాహుల్ గాంధీని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతాంగం పట్ల చిత్తశుద్ధిలేని పార్టీ టీఆర్ఎస్ అని మండిపడ్డారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై టీఆర్ఎస్ ఎంపీలు ఒక్కరోజైనా మాట్లాడారా అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో బీజేపీ , టీఆర్ఎస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.

బీజేపీకి బీ టీంగా టీఆర్ఎస్..

బీజేపీకి బీ టీంగా టీఆర్ఎస్..


అసలు టీఆర్ఎస్ ఎంపీలు ఏ రోజైనా ధాన్యం సమస్యపై మాట్లాడారా ? అని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నిలదీశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ బీ టీంగా మారిందని ఆరోపించారు. రైతుల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వచ్చి పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల పక్షాన కాంగ్రెస్ ఎంపీలు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని చెప్పారు. రాజకీయాలు పక్కనబెట్టి రైతుల సమస్యలు పరిష్కరించేలా చూడాలని సూచించారు. సీఎం కేసీఆర్ చేసే డ్రామాల‌ను పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు కూడా చేస్తున్నారని చురకలు అంటించారు.

రాజీనామాకు సిద్ధం..

రాజీనామాకు సిద్ధం..


రైతుల పక్షాన ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రూ.70 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత తమ పార్టీదని గుర్తు చేశారు. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైంది.. ముగ్గురం అయినా .. పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తోందని తామేనని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలని విరుచుకుపడ్డారు. రైతుల కోసం తమ పదవులు వదులుకునేందుకు సిద్ధమన్నారు.. మరి టీఆర్ఎస్ ఎంపీలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో దొంగ నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.

రైతుల‌ను ద‌గా చేస్తున్న కేసీఆర్..

రైతుల‌ను ద‌గా చేస్తున్న కేసీఆర్..


అన్నదాతలను ఆదుకోవాల్సింది పోయి.. వారి పట్ల కేసీఆర్ ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. ఎరువుల ధరలు పెంచడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో చేతికి వచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. అవసరమైతే పట్టణాలల్లో 2 గంటలు కోత విధించి .. రైతాంగానికి మేలు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు గందరగోళంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు విద్యుత్ కోతలు, మరోవైపు ఎరువుల ధరలు పెంచుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

 రాహుల్ గాంధీతో భేటీ...

రాహుల్ గాంధీతో భేటీ...


ఇదిలా ఉండగా .. పార్లమెంటులో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. ఈసందర్భంగా తెలంగాణలో నెలకొన్న తాజా పరిస్థితులను వివరించారు. పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రై బ‌య‌ట‌కు వ‌స్తోన్న స‌మ‌యంలో గేట్ నెంబ‌ర్ 1 వ‌ద్ద రాహుల్‌ని క‌లిసారు. రాష్ట్రంలోని సీనియర్ నేతలకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్‌లు దొరకడం లేదంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందన్న విషయాన్ని రాహుల్ దృష్టికి ఎంపీలు తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన రాహుల్ అలాంటి తప్పుడు ప్రచారాలకు ఆందోళన చెందవద్దన్నారు. వీటన్నింటిపై వివరాలు అందించాలని కోరారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని ఎంపీలకు హామీ ఇచ్చారు.

English summary
Congress MPs Komatireddy Venkat reddy, Uttam Kumar Reddy meet Rahul Gandhi in Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X