'రేవంత్‌‌ను పొలిట్‌బ్యూరోకు పిలవలేదు, వివరణ కోసం చూస్తున్నాం'

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ చెప్పిన కాంగ్రెస్ నేతలపై పరువు నష్టం దావా వేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలపై రేవంత్‌ వివరణ కోసం తాము ఎదురుచూస్తున్నామని రేవూరి ప్రకాష్‌రెడ్డి చెప్పారు.

Revanth Reddy VS TDP senior leaders బాబు రేవంత్ వైపా!, సీనియర్ల వైపా! అదే జరిగితే? | Oneindia Telugu

ఆదివారం నాడు జరిగిన తెలంగాణ టిడిపి పొలిట్‌బ్యూరో సమావేశానికి రేవంత్‌ను పిలవలేదని రేవూరి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై రేవంత్‌రెడ్డి ఏ రకమైన వివరణ ఇస్తారోననే ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని రేవూరి ప్రకాష్‌రెడ్డి చెప్పారు.

We are waiting for Revanth Reddy clarification says Revuri Prakash Reddy

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాల నుంచి రాగానే రేవంత్ విషయంలో క్లారిటీ వస్తుందని రేవూరి తెలిపారు. కాంగ్రెస్‌కు మొదట్నించీ తప్పుడు ప్రచారాలతో పార్టీలను దెబ్బతీయడం అలవాటేనని రేవూరి ప్రకాష్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTDP leader Revuri Prakash Reddy demanded that file a defamation suite on Congress. We are waiting for Revanth Reddy clarification. He spoke to media on Monday.
Please Wait while comments are loading...