దేశానికే ఆదర్శం: ‘పల్లె ప్రగతి’ పైలాన్ ఆవిష్కరించిన కెటిఆర్, హరీశ్(పిక్చర్)
మెదక్: యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మహిళా సంఘాల మాదిరిగానే పల్లె ప్రగతి పథకాన్ని విజయవంతం చేసి మహిళలు తలుచుకుంటే అన్ని అద్భుతాలే అన్నట్లుగా నిరూపించాలని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.
గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ఫ్) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తెలంగాణ పల్లెప్రగతి పథకం ఫైలాన్‌ను శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుడూ.. రాష్ట్రంలో 438 మండలాలు ఉండగా మొదటి ప్రాధాన్యతగా 150 మండలాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు గుర్తించామని, ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు బాగాలేవని వారిని ప్రోత్సహించడానికే పల్లెప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రపంచ బ్యాంకును ఒప్పించి 450 కోట్లు, ప్రభుత్వం 192 కోట్లు అదనంగా కేటాయించి మొత్తం 642 కోట్లతో పేద ప్రజలకు ఉపాధి మార్గాలను చూపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.
వెనుకబడిన మండలాల ప్రజల ముఖాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు. 150 మండలాల్లో 74 లక్షల మంది ఆర్థికంగా నిలదొక్కుకోలేక దారిద్రరేఖకు దిగువున ఉన్నారని అన్నారు. మహిళలకు అవకాశం కల్పిస్తే కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని అభిప్రాయపడ్డారు.
దేశంలోనే మహిళా సంఘాలు ఆదర్శవంతంగా పని చేస్తున్నాయని, మహిళలు కుటుంబ యజమానికి తోడుగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు. పల్లె ప్రగతికి చేయూతనివ్వడానికి 2.75 లక్షల గ్రూపులను ఏర్పాటు చేసి ప్రతి గ్రూపు 50 వేల రూపాయలను భరిస్తే ప్రభుత్వం ఇచ్చే నిధులతో మొత్తం రూ.1090 కోట్లు అవుతుందని ఈ నిధులతో జీవనోపాధికి ఉపయోగించుకోవచ్చన్నారు.

మొక్క నాటుతూ..
దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న మహిళా సంఘాల మాదిరిగానే పల్లె ప్రగతి పథకాన్ని విజయవంతం చేసి మహిళలు తలుచుకుంటే అన్ని అద్భుతాలే అన్నట్లుగా నిరూపించాలని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.

పల్లె ప్రగతి
గ్రామీణాభివృద్ధి శాఖ (సెర్ఫ్) ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తెలంగాణ పల్లెప్రగతి పథకం ఫైలాన్‌ను శనివారం మెదక్ జిల్లా కౌడిపల్లిలో మంత్రులు కెటిఆర్, హరీష్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.

పైలాన్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుడూ.. రాష్ట్రంలో 438 మండలాలు ఉండగా మొదటి ప్రాధాన్యతగా 150 మండలాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు గుర్తించామని, ఇందులో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులు బాగాలేవని వారిని ప్రోత్సహించడానికే పల్లెప్రగతి పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

పల్లె ప్రగతి
ప్రపంచ బ్యాంకును ఒప్పించి 450 కోట్లు, ప్రభుత్వం 192 కోట్లు అదనంగా కేటాయించి మొత్తం 642 కోట్లతో పేద ప్రజలకు ఉపాధి మార్గాలను చూపించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.

పల్లె ప్రగతి
వెనుకబడిన మండలాల ప్రజల ముఖాల్లో వెలుగులు నింపడానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందన్నారు.
కూరగాయల వ్యాపారం, గొర్రెలు, మేకలు, పాడి పశువులు తదితర మార్గాల ద్వారా ప్రస్తుతం ఐదు వేలు సంపాదిస్తే దాన్ని పదివేల ఆదాయానికి పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు. పథకం అమలుపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పక్కా ప్రణాళికలు రూపొందించుకుని ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రస్తుతం మీ సేవా కేంద్రాల ద్వారా వివిధ రకాల సర్టిఫికెట్లు పొందుతున్నారని, త్వరలోనే పంచాయతీల్లో పల్లె సమగ్ర సేవా కేంద్రాలను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాల ద్వారా ఉపాధి కూలీల వేతనం, పింఛన్లు పొందడటంతో పాటు కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టబోతున్న బీమా సొమ్మును కూడా అందించే ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్మూలనకు గ్రామ జ్యోతి కార్యక్రమం నిర్వహిస్తుండగా ఆయా మండలాల్లో పల్లె ప్రగతి పథకం కూడా తోడుగా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రభుత్వం బహుముఖ లక్ష్యాలతో ముందుకు వెళుతుంటే పదేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏనాడు పల్లె ముఖం చూడలేదని, తమ ప్రభుత్వం పల్లెలను అభివృద్ధి చేసేందుకు జనంలోకి వెళుతున్నామని అన్నారు.
వచ్చే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను చూసి తమకు పుట్టగతులుండవనే భయంతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. 15 వేల కోట్లతో పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.
మెదక్ జిల్లా మట్టి బిడ్డ అయిన ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న 172 కోట్ల వడ్డి లేని రుణ బకాయిలను మహిళా సంఘాలకు ప్రభుత్వం విడుదల చేసిందని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రెమాండ్ పీటర్, సైంటిస్టు విజయకుమార్, సిఇఓ మురళి, కలెక్టర్ రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications