వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపిని భుస్థాపితం చేస్తాం, అప్పుడే చేరాల్సింది కానీ..: ఎర్రబెల్లి

|
Google Oneindia TeluguNews

వరంగల్: రానున్న కొద్ది రోజుల్లోనే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి లేకుండా సమూలంగా భూస్థాపితం చేస్తామని పాలకుర్తి నియోజకవర్గ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ మేరకు టిఆర్‌ఎస్ నాయకత్వం ప్రత్యేక బాధ్యతలు అప్పగించిందని వెల్లడించారు.

సోమవారం వరంగల్ జిల్లా తొర్రూరులో నిర్వహించిన టిఆర్‌ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..నియోజకవర్గంలో మూడు నెలల పాటు పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటానని, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి తెలంగాణలో టిడిపిని లేకుండా చేస్తానని అన్నారు.

ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నానని ఎర్రబెల్లి తెలిపారు. తాను తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎలాంటి పదవులు ఆశించకుండా పాలకుర్తి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే తెలంగాణలో టిడిపిని.. టిఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ కెసిఆర్ నాయకత్వంలో చేరడం జరిగిందన్నారు.

We will close TDP in Telangana, says Errabelli

ఇప్పటివరకు తన కష్టపడి పనిచేసిన కార్యకర్తల రుణం తీర్చుకుంటానని అన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్త దిశానిర్ధేశం మేరకే పనిచేస్తానని అన్నారు. గత శాసనసభ ఎన్నికల ముందే టిఆర్‌ఎస్‌లో చేరాలని తనపై ఒత్తిడి ఉన్నప్పటికీ టిడిపికి అన్యాయం చేయవద్దనే ఉద్దేశంతో పార్టీ లో చేరలేదన్నారు.

అయితే, ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టిడిపి స్థానం లేదని స్పష్టం కావడంతో విధిలేని పరిస్థితుల్లో టిడిపిని టిఆర్ఎస్‌లో వీలినం చేయడం జరిగిందన్నారు.

అభివృద్ధే లక్ష్యంగా పార్టీలో అన్ని వర్గాలను కలుపుకుని పనిచేస్తానని అన్నా రు. ఈ సమావేశంలో టిఆర్‌ఎస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం మేరకు నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ట కోసం ఎమ్మెల్యే ఎర్రబెల్లితో కలిసి పనిచేస్తానని అన్నారు.

రాజకీయాల్లో త్యాగాలు తనకు కొత్తేమీ కాదని గతంలో కూడా ఎర్రబెల్లి కోసం త్యాగం చేసిన విషయం పార్టీ శ్రేణులకు తెలుసునని అన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, అంతముందు మండలంలోని మడిపెల్లి గ్రామం లో గ్రామ మాజీ సర్పంచ్ రామసహాయం కిశోర్‌రెడ్డి నాయకత్వంలో సుమారు 1000 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి దయాకర్‌రావు, సుధాకర్‌రావుల సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

English summary
TRS MLA Errabelli Dayakar Rao on Monday said that they will close TDP in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X