కలెక్టర్ పై కేసు పెడతాం.!ధరణిలో నమోదైన భూములన్నీ చెల్లనివా?ప్రభుత్వ తీరుపై ఈటల జమున ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వంపైన, అధికారులపైన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున మండిపడ్డారు. తమ భూములకు సంబంధించిన అంశం కోర్ట్ పరిధిలో ఉందని, తమకు ఎటువంటి వివరాలు ఇవ్వకుండా మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తారని, కలెక్టర్ లు మీడియా సమావేశాలు పెట్టడానికే ఉన్నారా?అని నిలదీసారు. ధరణిలో నమోదైన భూములనే తాము కొన్నామని, లాయర్ ద్వారా లీగల్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని వివరించారు.

కోర్టులో ఉన్న అంశాలను మీడియాకు ఎలా చెప్తారు.. కలెక్టర్ వైఖరిని తప్పుబట్టిన ఈటల జమున
రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికి తప్పుడు భూములుగా చిత్రీకరిస్తున్నారంటే ధరణి వల్ల ఉపయోగం లేదా?ధరణిలో ఉన్న భూములన్ని తప్పుడు భూములేనా అని జమున ప్రశ్నించారు. కలెక్టర్ విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడని, సర్వే నెంబర్ 81 లో తమకు ఉన్నది 5 ఎకరాల 30 గుంటలేనని, సర్వే నెంబర్ 130 లో మూడు ఎకరాలు ఉందని, కానీ కలెక్టర్ మాత్రం 70 ఎకరాలు ఆక్రమించారు అని చెపుతున్నాడని జమున పేర్కొన్నారు. మేము ఎవరి దగ్గర భూమి గుంజుకుని రిజిస్ట్రేషన్ చేసుకోలేదని, టిఆర్ఎస్ కండువా కప్పుకొని కలెక్టర్ లు పనిచేస్తున్నారని మండిపడ్డారు.

కలెక్టర్ పై కేసు పెడతాం.. భయపడేది లేదన్న జమున
2018లో తాము రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని, అన్ని రకాల అనుమతులు వచ్చాకే షెడ్స్ నిర్మాణం చేసామని వివరించారు. మొన్నటి వరకు ధరణిలో ఉన్న భూమి ఇప్పుడు ప్రైవేటు భూమిగా చూపిస్తుందని, ఇది చాలా అన్యాయమని అన్నరు. మంగళవారం కలెక్టర్ పై కేసు నమోదు చేస్తామని, నాలా కనెక్షన్ కు అప్లికేషన్ పెట్టినా ఇవ్వట్లేదని ఆరోపించారు.

ధరణి పోర్టల్ కి విశ్వసనీయత లేదా.? ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారన్న జమున
చాలా మంది రాజకీయ నాయకులకు హ్యాచరిలు ఉన్నాయని, మరి వాటి దగ్గర పొల్యూషన్ రాదా? పొల్యూషన్ సర్టిఫికెట్ కావాలని ఇప్పుడు అడుగుతున్నారని మండిపడ్డారు జమున. ఈటెలను రోడ్డు మీద వేసేందుకు కుట్రలు చేస్తున్నారని, ఫీడ్ ప్లాంట్ పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. జమునా హ్యాచరిస్ కు అధికారులు సహాకరించ్చోద్దని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని, ప్రభుత్వం ఒక వ్యక్తి మీద ఇంత కక్ష్య పూరితంగా వ్యవహరించడం విస్మయానికి గురిచేస్తుందన్నారు జమున.

సీఎం కక్ష్య సాధింపు చర్యలు మానుకోవాలి.. కేసీఆర్ బండారం బయటపెడతామన్న జమున
అధికారుల సర్వేను కోర్ట్ తో పాటు తమకు కూడా ఇవ్వాలని, చంద్రశేఖర్ రావు ఇట్లనే టార్గెట్ చేస్తే, ఈటెల రజేందర్ అన్ని జిల్లాలు తిరిగి చంద్రశేఖర్ రావు బండారం బయటపెడుతారని హెచ్చరించారు ఈటల జమున. చంద్రశేఖర్ రావు రాజకీయ కక్ష్య సాదింపు మానుకోకపోతే ఈటల రాజేందర్ జిల్లాల్లో పర్యటించి చంద్రశేఖర్ రావు బండారం బయటపెడతారని ఈటల జమున హెచ్చరించారు.












Click it and Unblock the Notifications