BioAsia Summit: తెలంగాణలో భారీగా పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు
తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్న సంస్థలు, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. బయో ఏషియా (Bio Asia)సదస్సు ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. బయో ఏషియా 2025 సదస్సుకు ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందన్నారు.
బయో ఏషియా చరిత్రలో ఈ ఏడాది సదస్సు ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు, దేశ, విదేశాల నుంచి 4 వేల మంది ఫార్మా, హెల్త్ కేర్ ఇండస్ట్రీ లీడర్స్, పాలసీ మేకర్స్, ఆవిష్కర్తలు హాజరయ్యారు. హెల్త్, ఫార్మా రంగాలకు చెందిన 100 మంది నిపుణులు ఆయా రంగాల్లో నెలకున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారని మంత్రి తెలిపారు.

ఈ ఏడాది బయో ఏషియా సదస్సులో 200కుపైగా బీటూబీ మీటింగ్స్ జరిగాయని, గత ఏడాది కంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అమెరికాకు చెందిన బయో టెక్నాలజీ దిగ్గజ సంస్థ 'ఆమ్జెన్' రాష్ట్రంలో భారీగా పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ఈ సంస్థ పెట్టుబడితో సుమారు 3 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. సదస్సులో మొత్తం 84 స్టార్టప్స్ సదస్సులో పాల్గొన్నాయన్నారు.
ఆవిష్కరణలకు అండగా ఉండేందుకు, కొత్త ఆలోచనలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమలతో కలిసి పనిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.
The number of MoUs signed at the Bio Asia Annual Conference is a testament to the growth of Life Sciences in Telangana and how the leadership of CM Revanth Reddy garu is paving the way for a flourishing Healthcare Innovation and Life Sciences Ecosystem.#BioAsia2025 #Hyderabad… pic.twitter.com/jeSOZ1S1q2
— Sridhar Babu Duddilla (@OffDSB) February 26, 2025
తెలంగాణకు భారీ పెట్టుబడులు
బయో ఏషియా సదస్సులో భాగంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. గ్రీన్ ఫార్మా సిటీలో తమ యూనిట్ల ఏర్పాటుకు ఆరు సంస్థలు ముందుకు వచ్చాయి. తాజాగా, మరో 11 కంపెనీలు పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ సంస్థలు రూ. 5445 కోట్ల పెట్టుబడితో కొత్తగా 9800 ఉద్యోగాలు కల్పిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications