ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ పోరాటానికి మా మద్దతు: థ్యాంక్సంటూ మోడీ సర్కారుపై పినరయి విజయన్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఖమ్మం: బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా భారత్ రాష్ట్ర సమితి అవతరించిన అనంతరం తొలిసారిగా జరుగుతున్న బహిరంగ సభలో ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాలు సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. లక్షలాదిగా జనం తరలివచ్చారు.

కేసీఆర్ పథకాలపై పినరయి విజయన్ ప్రశంసలు

కేసీఆర్ పథకాలపై పినరయి విజయన్ ప్రశంసలు

ఈ సందర్భంగా కేరళ సీఎం పినరయి విజయన్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు చాలా మంచి కార్యక్రమమని అన్నారు. సంక్షేమ పథకాలను కేరళలోనూ అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పినరయి విజయన్ ప్రశంసలు కురిపించారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ చేపట్టిన పోరాటానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ఈ సభ దేశానికి ఓ దిక్సూచీ లాంటిదని విజయన్ అన్నారు.

కేసీఆర్‌కు థ్యాంక్సంటూ కేంద్రంపై పినరయి విజయన్ విమర్శలు

కేసీఆర్‌కు థ్యాంక్సంటూ కేంద్రంపై పినరయి విజయన్ విమర్శలు

పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిన కేసీఆర్ కు విజయన్ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంతో రాచరికాన్ని తరిమికొట్టారని గుర్తు చేశారు.

కేంద్రం హిందీని బలవంతంగా రుద్దుతోందని విజయన్ అన్నారు. ప్రాంతీయ భాషలను కనుమరుగు చేసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
సుప్రీంకోర్టును కూడా నేరుగా కేంద్రమంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి కష్ట సమయంలో రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు కాపాడాలన్నారు. ఉపరాష్ట్రపతి కూడా సుప్రీంకోర్టును కించపర్చేలా మాట్లాడారన్నారు. దేశంలో పేదరికం పెరిగిందని, సంపద కొద్ది మంది చేతుల్లోనే ఉందన్నారు.

కేరళలోలా తెలంగాణలో జరగాలన్న పినరయి విజయన్

మోడీ పాలనలో మైనార్టీలు, దళితులపై దాడులు పెరిగాయని పినరయి విజయన్ ఆరోపించారు. కేరళలో మతతత్వ శక్తుల కుట్రలు తిప్పికొడుతున్నామని.. తెలంగాణలో కూడా అదే జరగాలని అన్నారు.

అసెంబ్లీలను బలహీనం చేసేలా బిల్లుల్ని తొక్కిపెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వన్ నేషన్-వన్ ట్యాక్స్.. వన్ నేషన్-వన్ ఎలక్షన్ అంటూ నేరుగా ఫెడరలిజంపై దాడి చేస్తున్నారని విజయన్ విమర్శించారు. ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మోడీ పాలన సాగుతోందన్నారు.

రాష్ట్రాలపై కేంద్ర పెత్తనంటూ విజయన్ ఫైర్

రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపైనా కేంద్రం పెత్తనం చేస్తోందని.. కీలక విషయాల్లో రాష్ట్రాలను సంప్రదించడం లేదని విజయన్ ఆరోపించారు. రాజ్‌భవన్‌లు బీజేపీ కార్యాలయాలుగా మారాయని విమర్శించారు. ప్రధాని మోడీ కార్పొరేట్లకు తొత్తుగా మారారని కేరళ సీఎం పినరయి విజయన్‌ ఆరోపించారు. కాగా, ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న కేరళ సీఎం విజయన్‌ను సీఎం కేసీఆర్‌ సన్మానించి జ్ఞాపిక బహూకరించారు.

English summary
We will support to KCR and BRS: Kerala CM Pinarayi Vijayan slams centre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X