తెలంగాణకు సహకారం: వెంకయ్య, సాగర్ టెయిల్ పాండ్‌పై తెలంగాణ పేచీ

న్యూఢిల్లీ: గృహ నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన దృష్టికి తీసుకువచ్చారని, శాఖాపరంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

వ్యర్థ పదార్థాలపై అధ్యయనం చేయడానికి వచ్చిన రాష్ట్ర ప్రతినిధి బృందంతో సోమవారం సమావేశమైన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం ప్రారంభించబోయే అందరికీ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకంతో అనుంధానం చేస్తామన్నారు. కాగా, ఓటుకు నోటు వ్యవహారంపై స్పందించేందుకు వెంకయ్య నిరాకరించారు.

We will work together: Venkaiah Naidu on Telangana government

సాగర్ టెయిల్ పాండుపై తెలంగాణ

తెలుగు రాష్ట్రాల మధ్య నిత్యం ఓ వివాదం తలెత్తుతోంది. తాజాగా, గుంటూరు జిల్లా సత్రశాల వద్ద నిర్మితమవుతున్న నాగార్జున సాగర్ టెయిల్ పాండు ప్రాజెక్టు.. విభజనలో భాగంగా ఏపీకి వెళ్లింది. దీనిని తమకు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌కు లేఖ రాశారు.

సాగర్‌లో అంతర్భాగంగా ఉన్నందున దీని నిర్వహణ తమకు ఇవ్వాలని కోరారు. ఈ ప్రాజెక్టు కింద 25 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. అయితే, ఇక్కడ తయారయ్యే విద్యుత్ మాత్రం ఏపీకే ఇస్తామని తెలంగాణ సర్కారు చెబుతోంది.

దీనికన్నా దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు కూడా తెలంగాణ చేతుల్లో ఉందని, అందువల్ల మధ్యనున్న టెయిల్ పాండు తెలంగాణకే చెదాలని ఏపీ వాదన. పైనా కింద ఉన్న ప్రాజెక్టులు తెలంగాణవే కాబట్టి మధ్యలో ఉన్నది తమకే దక్కాలని తెలంగాణ చెబుతోంది. ఏపీ స్పందించవలసి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+