Alert: మరో నాలుగు రోజులు.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
తెలంగాణ రాష్ట్రాన్ని వరుణుడు వణికిస్తున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలతో సతమతమవుతోన్న ప్రజలకు మరోసారి ఇబ్బందులు తప్పవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా రాష్ట్రంలో మరో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. అయితే, ఈసారి భాగ్యనగరంపై పెద్ద ప్రభావం ఉండే అవకావం లేదని, రూరల్ జిల్లాల్లో మాత్రం భారీ వర్ష సూచన ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కుంభవృష్టి వర్షాలు..
తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న దానిని బట్టీ.. మంగళవారం మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా భాగ్య నగరంపై ఈ అల్పపీడన ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, రూరల్ జిల్లాల్లో మాత్రం కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
వారి అంచనా ప్రకారం.. తాజా అల్పపీడనం కారణంగా ఈరోజు(బుధవారం) ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనా వేస్తోంది. అలాగే, రేపు (గురువారం) కూడా రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు మరి కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
ఈ కారణంగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే, ఈ నెల 27 వరకు ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అధికారులతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.












Click it and Unblock the Notifications