వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

28 వరకు బీ అలర్ట్: తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు: కంప్లీట్ లిస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ఎండ తీవ్రత కాస్తంత తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లగా మారింది. వేడి గాలుల ఉధృతి చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గింది. తెలంగాణలో ఈ నెల 28వ తేదీ వరకు చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వచ్చే 72 గంటల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరుగా.. మరి కొన్ని చోట్ల భారీగా వర్షాలు పడటానికి అవకాశం ఉందని హైదరాబాద్‌లోని ప్రాంతీయ భారత వాతవరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

మారుమూల మహబూబ్ నగర్ జిల్లా నుంచి సోషల్ మీడియా సెలెబ్రిటీ దాకా: మోడీతో గెడ్డంతో కంపేర్మారుమూల మహబూబ్ నగర్ జిల్లా నుంచి సోషల్ మీడియా సెలెబ్రిటీ దాకా: మోడీతో గెడ్డంతో కంపేర్

తెలంగాణలో కొద్దిరోజులుగా పగటి పూట ఎండ భయపెట్టినప్పటికీ.. సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ఎండ తీవ్రత తగ్గి అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో మూడు రోజులపాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణల్లోని కొన్ని జిల్లాలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 Weather forecast: Some parts of Telangana will receive railfall

కొన్ని జిల్లాల్లో పిడుగుపాటుు అవకాశం ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, నారాయణ్‌పేట్, మహబూబ్ నగర్, జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాలకు వచ్చే మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు అంచనా వేశారు.

శుక్రవారం మరాఠ్వాడా పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడిందని, ఫలితంగా- మరాఠ్వాడా నుంచి కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తా, తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నారు. దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

English summary
A thunderstorm alert has been issued by the Indian Meteorological Department Hyderabad, Moderate to heavy rains will be witnessed between April 14 and April 28 in various parts of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X