తెలంగాణలో రెండ్రోజులపాటు వర్షాలు: 18 నాటికి అల్పపీడనం

హైదరాబాద్: రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పొడి వాతావరణమే ఉంది. హైదరాబాద్ నగరంలో అప్పుడప్పుడు మోస్తరు వర్షం పడినప్పటికీ.. ఇతర జిల్లాల్లో మాత్రం పొడి వాతావరణమే కొనసాగింది. ఎండ తీవ్రత కూడా కొంత ఎక్కువగానే ఉంది. మరోవైపు, తెలంగాణ జిల్లాల్లో ఉక్కపోత వాతావరణం కూడా కొనసాగుతోంది. తాజాగా, వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది.

రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బుధవారం ఆవర్తనం ఈశాన్యాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద సముద్ర మట్టం నుంచి 4.5 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో మధ్యలో ఉందని తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుందని పేర్కొంది.

Weather report: next two days rain in telangana districts.

ఆవర్తనం ప్రభావంతో ఆగస్టు 18వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బువారం దిగువ స్థాయి గాలులు పశ్చిమ వాయువ్య దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వెల్లడించారు.

కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వచ్చే శనివారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు, జలాశయాల్లో పూర్తి స్థాయి నీటి నిల్వలు ఉన్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు వరినాట్లు వేసుకున్నారు. తాజా వార్తల నేపథ్యంలో వర్షాలు పడితే మిగిలిన వరి నాట్లు పూర్తవుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక ఎండలు, ఉక్కపోత నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+