పాలమూరుకు కేసీఆర్ ఏం చేశాడు? కొల్లాపూర్ ఎమ్మెల్యే ఓ పశువులా..: భగ్గుమన్న వైఎస్ షర్మిల
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగిస్తున్న వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిత్యం విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఒకపక్క కాళేశ్వరం ప్రాజెక్టు పై, సీఎం కేసీఆర్ కుటుంబ అవినీతిపై నిప్పులు చెరుగుతున్న వైయస్ షర్మిల, మరో పక్క రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా పాలమూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ షర్మిల కొల్లాపూర్ నియోజకవర్గంలో తన పాదయాత్ర సందర్భంగా తనదైన శైలిలో సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.

కెసిఆర్ మాయమాటలను మరోసారి నమ్మవద్దు : వైఎస్ షర్మిల
దొరల పాలనకు స్వస్తి పలకడానికి, వైయస్ఆర్ సంక్షేమ పాలనకు పట్టం కట్టడానికి ప్రజాప్రస్థానం పాదయాత్రకు భారీగా తరలివచ్చి, ఆశీర్వదించిన కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొన్న వైయస్ షర్మిల నూట ముప్పై ఐదు రోజులుగా సాగిస్తున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో ప్రజలు తనను ఎంతగానో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. రెండుసార్లు మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కెసిఆర్, కమీషన్లు మింగుతూ.. ప్రజలను హింసిస్తూ, ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తూ.. దొరల పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. కెసిఆర్ మాయమాటలను మరోసారి నమ్మవద్దు అంటూ పేర్కొన్న వైయస్ షర్మిల, మన భవిష్యత్తును ఆగం చేసుకోవద్దు దొరల పాలన పోవాలని విరుచుకుపడ్డారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలి: భగ్గుమన్న షర్మిల
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు అని చెబుతున్న కేసీఆర్ పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ఒక్క ఎకరాకైనా నీళ్లు పారించాడా? వాల్మీకి, బోయలను ఎస్టీలో చేర్చాడా? సింగోటం-గోపాలదిన్నె లింక్ కెనాల్ కట్టాడా? అని ప్రశ్నించారు వైయస్ షర్మిల. పాలిటెక్నిక్ కాలేజీ ఇచ్చాడా? ఓట్లు వేయించుకుని,పత్తా లేకుండా పోయాడు అంటూ మండిపడ్డారు వైయస్ షర్మిల. కేసీఆర్ తన స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ అవసరముంటే అక్కడ ప్రత్యక్షం అవుతాడు అని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలను కలిసే టైం ఉంటుంది కానీ మన రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మాత్రం టైం ఉండదు అంటూ వైయస్ షర్మిల అసహనం వ్యక్తం చేశారు.

కొల్లాపూర్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల.. పశువులా అమ్ముడుపోయాడని విమర్శలు
కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని టార్గెట్ చేసిన వైఎస్ షర్మిల, కొల్లాపూర్ ఎమ్మెల్యే ఓ పశువులా అమ్ముడుపోయాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డిని కట్టవద్దని కోర్టుకెళ్లాడట. కాంట్రాక్టర్ కమీషన్లు ఇస్తే విత్ డ్రా చేసుకున్నాడట అంటూ కొల్లాపూర్ ఎమ్మెల్యే ను టార్గెట్ చేశారు. కల్వకుర్తిలో ఎల్లూరు పంప్ హౌజ్ మునిగితే రిపేర్ చేయాలన్న సోయి కూడా ఈ ఎమ్మెల్యేకు లేదు అంటూ వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ అందమైన అబద్ధం.. అద్భుతమైన మోసం
ఇక ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అందమైన అబద్ధమని అద్భుతమైన మోసమని మండిపడుతున్న షర్మిల కనీస ఎత్తులు చూడకుండా ప్రొటెక్షన్ వాల్ నిర్మించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో లక్షన్నర కోట్ల అవినీతి జరిగిందని విమర్శలు చేస్తున్న బీజేపీ సీబీఐ విచారణ జరిపించటానికి వెనకడుగు వేస్తుందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి టిఆర్ఎస్ దొందూ దొందే అంటూ వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు.
-
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!












Click it and Unblock the Notifications