రాహుల్ గాంధీ 60 ఏళ్లు ఏం చేశారు: ఎమ్మెల్సీ కవిత

బీసీ జనగణన చేయాలని కొత్తగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. నేడు నిజామాబాద్ లో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీ బీసీ పాలిటిక్స్ ను టార్గెట్ చేశారు.

బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న ఆమె, 60 ఏళ్ల నుంచి రాహుల్ గాంధీ ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు.రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎంత మంది బీసీలు ఉన్నారో గుర్తించాలని, బిసి మంత్రిత్వ శాఖ గురించి బి ఆర్ యస్ ఎన్ని సార్లు అడిగినా కేంద్రంలో బిజెపి స్పందించలేదన్నారు. కాంగ్రెస్ కనీసం మాట్లాడలేదు అంటూ రెండు పార్టీలపై ఆమె విరుచుకుపడ్డారు.

What did Rahul Gandhi do for 60 years over BC census: MLC Kavitha

60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు చేయని కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇప్పుడు కుల గణన చేస్తామని మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడే బీసీలు గుర్తుకు వచ్చారా అంటూ ప్రశ్నించారు. దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారో లెక్క తేల్చాలని, మహిళా బిల్లులో కూడా బీసీ మహిళల కోట తేల్చాలని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

కాంగ్రెస్ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని మండిపడిన కవిత బీసీలకు హాస్టల్స్ లేవు.. డిగ్రీ కళాశాలలు లేవంటూ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల మందికి బీసీలకు కల్యాణ లక్ష్మి వర్తింపజేశామని, తమ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

బీఆర్ ఎస్ హయాంలోనే కల్లుగీత కార్మికులకు న్యాయం చేశామని, 70 వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాం అన్నారు. కల్లుగీత కార్మికుల భీమా ను 5 లక్షలకు పెంచామని, 2014 తర్వాత కల్లుషాపు లను పునరిద్దరించి ఈత, తాటి వనాలు ప్రోత్సహించామన్నారు. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు.

డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ అర్బన్ నుండి ఎన్నికల బరిలోకి దిగిన గణేష్ గుప్తా కు ఓటు వేస్తే కేసీఆర్ కు ఓటు వేసినట్టే అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+