వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతుచిక్కని కేసీఆర్ వ్యూహం - మౌనం : ఆ సమావేశం తరువాతే..ఆట మొదలు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. ఇప్పుడు టార్గెట్ కేసీఆర్ గా బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ సైతం అధికార టీఆర్ఎస్ - బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందనే నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో వరుసగా తొలుత హోం మంత్రి అమిత్ షా..తరువాత ప్రధాని మోదీ పార్టీ నేతలతో సభలు నిర్వహించారు. అందులో టీఆర్ఎస్ ప్రభుత్వం పైన నేరుగా విమర్శలు చేసారు. కొంత కాలంగా కేంద్రం పైన ప్రధాని మోదీ నిర్ణయాల పైన విరుచుకుపడుతున్న సీఎం కేసీఆర్..ఈ సారి మాత్రం మౌనంగా ఉన్నారు. వారిద్దరి విమర్శల పైన ఆయన రియాక్ట్ కాలేదు.

కేసీఆర్ వ్యూహాత్మక మౌనం

కేసీఆర్ వ్యూహాత్మక మౌనం

మంత్రులు కౌంటర్ ఎటాక్ చేసారు. ప్రధాని హైదరాబాద్ కు వచ్చిన సమయంలో బెంగుళూరు వెళ్లిన సీఎం కేసీఆర్ రెండు మూడు నెలల్లో సంచలనం చోటు చేసుకుంటుందని ప్రకటించారు. ప్రధాని పర్యటన కంటే..తన టూర్ కు ప్రాధాన్యత పెరిగేలా చేసారు. ఇక, అప్పటి నుంచి కేసీఆర్ ఏం చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో మొదలైంది. ఇక, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనూ కేంద్ర ప్రభుత్వ తీరును సీఎం కేసీఆర్ ఎండ గట్టారు. దేశంలో ఏం జరుగుతోందంటూ కేంద్రం పైన ఫైర్ అయ్యారు. పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోయతాయని హెచ్చరించారు. మార్పు అవసరమని సూచించారు. అదే రోజు తొలి సారిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో తెలంగాణ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు.

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

తెలంగాణ పై బీజేపీ ఫోకస్

ఆ సమయంలోనూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారమని ధీమా వ్యక్తం చేసారు. కేసీఆర్ పూర్తిగా తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణ లో నిమగ్నమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ తెలంగాణలో మరింత పట్టు సాధించటమే కాకుండా.. జాతీయ రాజీయాల్లో భాగంగా కలిసొచ్చే పార్టీలతో ముందడుగు వేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఇక, బీజేపీ జాతీయ కార్యవర్గ సభలో హైదరాబాద్ లో నిర్వహణకు బీజేపీ నిర్ణయించింది. ఆ సమావేశాల సమయంలోనూ బీజేపీ జాతీయ నేతలు సైతం టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేసే అవకాశం ఉంది.

కీలక ప్రకటనకు రంగం సిద్దం అవుతోందా

కీలక ప్రకటనకు రంగం సిద్దం అవుతోందా


ఆ సమావేశాల తరువాత ఇక కేసీఆర్ పూర్తిగా రాజకీయాల పైనే ఫోకస్ చేస్తూ అడుగులు ముందుకు వేస్తారని తెలుస్తోంది. రాష్ట్రంలో హ్యాట్రిక్ ఖాయమనే ధీమాతో కేసీఆర్ ఉన్నారు. పలు రకాలుగా చేయిస్తున్న సర్వేల ఫలితాలు టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. ఏ పార్టీ ప్రచారం చేసినా..ఇంతకంటే ఎక్కువగా ప్రజలకు ఇస్తామని..మేలు చేస్తామని చెప్పే ఛాన్స్ లేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో...జూలై తొలి వారం తరువాత తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary
CM KCR maintaining strategical silence, After BJP national excutive council meet he may speed upt the national political action plan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X