మేడారం జాతరకు కేసీఆర్ వెళ్లకపోవడానికి కారణం ఏంటి?పర్యటన రద్దైంది అందుకేనా?
హైదరాబాద్/ములుగు: మద్యాహ్నం రెండు గంటల నుండే మేడారం జాతరలో భక్తులు హడావిడికి బదులు రాజకీయ నేతలు హడావిడి మొదలైంది. అడుగడుగున పోలీసుల అప్రమత్తం, వాకీ టాకీలో మంతనాలు, ఉరుకులు పరుగులు. పార్కింగ్ ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ ను మరింత కట్టుదిట్టంగా దారిమళ్లింపు.. అదికారులు, పోలీసు యంత్రాంగంలో ఉత్కంఠ.. మేడారం భక్తుల్లో మాత్రం అయోమయం.. ఏంజరుగుతుంది.? ఎందుకు పోలీసుల హడావిడి అని అనేక సందేహాలు.
ఇదంతా మేడారం జాతరకు సీఎం చంద్రశేఖర్ రావు విజిట్ ఉండడంతో అధికారుల్లో ఉత్కంఠ. కానీ ఇంత టెన్షన్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉత్కంఠ పటాపంచలైంది. అదికారులు, పోలీసు సిబ్బంది ఉన్నట్టుండి ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే మేడారం పర్యటనను సీఎం రద్దు చేసుకున్నారని తెలవడంతో అంతా కూల్ ఐపోయారు. ఇంతకీ మేడారం జాతరకు సీఎం చంద్రశేఖర్ రావు వెళ్లకపోవడానికి కారణాలేంటి.?

సీఎం మేడారం పర్యటన రద్దు..
శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మేడారం పర్యటనను ఉన్నట్టుండి రద్దు చేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఆయన మేడారం పర్యటన శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉంటుందని అధికారికంగా అంతకు కొద్దిరోజుల ముందే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయన నిన్న మేడారం వస్తారని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో శుక్రవారం మేడారం చేరుకున్నారు.
హెలీ ప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. రోప్ పార్టీతో మాక్ డ్రిల్ నిర్వహించి సీఎం కోసం వేచి చూశారు. ఆయన వచ్చే సమయం దాటిపోయింది. అయినా కూడా సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. సాయంత్రం వరకూ వేచి చూసిన అధికారులు చివరికి సాయంత్రం 4 గంటలకు అంతా తిరుగుముఖం పట్టారు.

ఎలాంటి సమాచారం ఇవ్వని సీఎంవో..
అంతే కాకుండా నాకేమైంది చింతపిక్క లెక్క ఉన్నా అని తరుచుగా తన ఆరోగ్యం గురించి ధీమా వ్యక్తం చేసే చంద్రశేఖర్ రావు ఈ మద్య అనారోగ్యం బారిన పుడుతున్నట్టు తెలుస్తోంది. జ్వరం కారణంగా ఇటీవల పీఎం మోదీ పర్యటనలో కూడా చంద్రశేఖర్ రావు పాల్గొనలేదు. అలాగే ఆయన ఒంట్లో బాగాలేక పోవడం వల్ల కూడా తాజాగా మేడారం పర్యటన రద్దు చేసుకున్నట్లు ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యం బాగానే ఉందని, మేడారం వెళ్లకపోవడానికి మరో కారణం ఉందని సీఎం సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి చంద్రశేఖర్ రావు మేడారానికి రాకపోవడంపై అనేక రకరకాలుగా చర్చ సాగుతోంది.

సాయంత్రం 4 గంటల వరకు అంతా ఎదురుచూపులు..
అయితే, ఇటీవలి కాలంలో సీఎం చంద్రశేఖర్ రావు పర్యటనలు చివరి నిమిషాల్లో రద్దు అవుతున్న సంగతి సర్వ సాధారణంగా జరిగిపోతున్నాయి. మరి కాసేపట్లో చేరుకుంటారనే క్షణంలో పర్యటన రద్దయినట్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. మొన్న ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చిన సందర్భంలోనూ ఇలాగే జరిగింది. మళ్లీ ఇప్పుడు మేడారం విషయంలోనూ ఇదే జరిగింది. సీఎం హోదాలో మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క, సారలమ్మను దర్శించుకునే చంద్రశేఖర్ రావు చివరి క్షణంలో పర్యటనను రద్దు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సీఎం భేటీ..
టీఆర్‌ఎస్ శ్రేణులు, మేడారం వచ్చిన భక్తులు సీఎం చంద్రశేఖర్ రావు రాకపోవడంతో నిరాశ చెందారు. అయితే, ఉన్నట్టుండి ఎలాంటి సమచారం లేకుండా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పర్యటన ఎందుకు రద్దు అయిందనే అంశం వెనుక కారణాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేతో సీఎం చంద్రశేఖర్ రావు భేటీ కావాల్సి ఉంది. ఆదివారం ఆయన ముంబయి వెళ్లనున్నారు.
అయితే, ఈ సమావేశానికి సంబంధించి కీలక నేతలు, సలహాదారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సమీక్షిస్తున్నట్లు తెలిసింది. దేశ రాజకీయాల్లో మరో కూటమి ఏర్పాటుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో కూడా సంప్రదింపులు జరిపే క్రమంలోనే మేడారం వెళ్లలేకపోయారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications