హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏం ధరించాలి? ఫుల్ బిజీ, కన్ఫ్యూజే కానీ..!: ‘బిగ్ డే’పై కేటీఆర్ ఫన్నీ ట్వీట్, నెటిజన్లు ఇలా!

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు కాగా, మరొకటి మెట్రో రైలు ప్రారంభోత్సవం.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మంగళవారం రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు కాగా, మరొకటి మెట్రో రైలు ప్రారంభోత్సవం.

ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంకా ట్రంప్ తోపాటు ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలు నగరానికి చేరుకుంటున్నారు.

<strong>వివాదాలెందుకు? ఇది హ్యాపీ టైమ్: మెట్రోపై కేటీఆర్, 2.15ని.కి లాంచ్ చేయనున్న మోడీ</strong>వివాదాలెందుకు? ఇది హ్యాపీ టైమ్: మెట్రోపై కేటీఆర్, 2.15ని.కి లాంచ్ చేయనున్న మోడీ

కేటీఆర్‌కీ బిగ్ డేనే

కేటీఆర్‌కీ బిగ్ డేనే

రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ చరిత్రలో మెట్రో ప్రారంభోత్సం.. ఐటీ, పరిశ్రమల శాఖల చరిత్రలో జీఈఎస్-2017... రెండూ భారీ ఈవెంట్లే కావడంతో ఈ శాఖలకు మంత్రిగా ఉన్న కేటీ రామారావు గత కొద్ది రోజులుగా ఫుల్ బిజీ అయిపోయారు.

<strong>అంతా కేసీఆరే చేశారు!: నగర వాసుల కళ్లల్లో ‘మెట్రో' ఆనందం</strong>అంతా కేసీఆరే చేశారు!: నగర వాసుల కళ్లల్లో ‘మెట్రో' ఆనందం

ఇంత బిజీగానా? ఏం ధరించాలి: కేటీఆర్

ఇంత బిజీగానా? ఏం ధరించాలి: కేటీఆర్

తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలో అత్యంత బిజీగా గడుపుతున్న రోజు ఇదేకావచ్చునని.. ఏం ధరించాలో ఆలోచించే టైమ్ కూడా లేదంటూ సరదాగా ట్వీట్ చేశారు కేటీఆర్.

టైమ్ వేస్ట్ చేసే రోజు మాత్రం కాదు..

టైమ్ వేస్ట్ చేసే రోజు మాత్రం కాదు..

మంగళవారం ట్విటర్ వేదికగా కేటీఆర్ స్పందిస్తూ...‘మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్దికాలంలో అత్యంత బిజీగా గడుపుతున్న రోజు ఇదే అనుకుంటా... పట్టణాభివృద్ధి శాఖకు మెట్రో ప్రారంభం, ఐటీ పరిశ్రమల శాఖలకు జీఈఎస్ 2017 అతిపెద్ద ఈవెంట్లు. అంతేగాక.. ఎవరైనా స్టైలిష్‌గా రెడీ అవ్వాలని కోరుకునే రోజుల్లో ఇదికూడా ఒకటి... అయితే ఏం ధరించాలా అని ప్యాక్ చేసుకుంటూ టైమ్ వేస్ట్ చేసే రోజుమాత్రం కాదు ఇది...' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

నెటిజన్లు సలహాలు ఇలా..

అయితే, కేటీఆర్ ట్వీట్‌పై నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు. ఆయనకు ‘ఆల్ ది బెస్ట్' చెబుతూ వారి అభిప్రాయాలను చెబుతున్నారు. కొంతమంది గతంలో కేటీఆర్ సూటు ధరించిన ఫోటోలు పెట్టి ‘ఇది వేసుకో అన్నా.. సూపర్ ఉంటది...' అని కామెంట్ చేశారు. మరి కొందరు... ‘అన్నా... తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా పోచంపల్లి చేనేత చొక్కాలు వేసుకో.' అంటూ సలహా ఇచ్చారు.

English summary
Telangana Minister KT Rama Rao on Tuesday tweeted that he confused on what to wear on big day. But he is not wants to waste time for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X