ఎంసెట్ 2 లీకేజి: మొత్తం 50 కోట్ల డీల్, లబ్ధి పొంది విద్యార్ధులు వీరే!

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఎంబీబీఎస్‌లో ప్రవేశాల కోసం తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ 2 పేపర్ లీకైనట్లు వస్తున్న ఆరోపణలు నిజమేనని సీఐడీ అధికారులు బుధవారం అధికారిక ప్రకటన వెలువరించిన సంగతి తెలిసిందే. పరీక్ష నిర్వహణకు రెండు రోజుల ముందు పేపర్ లీకైందని ఇందులో నలుగురు సూత్రధారులు ఉన్నారని సీఐడీ నిగ్గుతేల్చింది.

ప్రశ్నాపత్రం లీక్‌తో 30 మంది వరకూ విద్యార్థులు లబ్ధి పొందినట్టు తమ విచారణలో వెల్లడైందని, ఇప్పటివరకూ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. పరీక్ష జరిగే సమయానికి సరిగ్గా రెండు రోజుల ముందు వీరికి ప్రశ్నాపత్రాన్ని నిందితులు ఇచ్చారని సీఐడీ నిర్ధారించింది.

దీంతో విద్యార్థులను ముంబై, బెంగళూరు ప్రాంతాలకు తీసుకువెళ్లి, అక్కడ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చి ముందుగానే ప్రిపేర్ చేయించి, పరీక్ష సమయానికి సెంటర్లకు వచ్చేలా చేశారని, ఈ కేసులో మరింత మందిని అదుపులోకి తీసుకోనున్నట్టు సీఐడీ అధికారులు స్పష్టం చేశారు.

What will be the telangana govt decision on leakage of eamcet 2 paper

కాగా, ప్రశ్నాపత్రం లీకవడం ద్వారా లాభం పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ 2ను పరీక్షను రద్దు చేస్తారా? లేక అక్రమార్కులను పక్కకు తప్పించి మిగిలిన విద్యార్ధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారా? అనే విషయమై ప్రభుత్వం తేల్చాల్సి ఉంది.

సుమారు 50 వేల మంది విద్యార్ధులు ఎంసెట్ 2 పరీక్షకు హాజరయ్యారు. వీళ్లలో 30 నుంచి 40 మంది వరకు అక్రమాలకు పాల్పడి ఉంటారని అంటున్నారు. అలాంటప్పుడు మిగిలిన వారందరికీ మళ్లీ పరీక్ష నిర్వహించడం ఎంత వరకు సబబు అనే వాదన వినిపిస్తున్నప్పటికీ ఎంసెట్ 2 రద్దుకే అవకాశం కనిపిస్తోంది.

ఎంసెట్ 2 పేపర్ లీకేజిని సీఐడీ నిర్ధారించిన నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి బుధవారం సాయంత్రం సీఎంఓ అధికారులతో సమావేశమయ్యారు. హెల్త్ విభాగానికి సంబంధించిన అధికారులంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. గతంలో పేపర్ లీకేజి అయినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏ విధంగా వ్యవహరించాయనే దానిపై ఈ సమావేశంలో చర్చించారని తెలుస్తోంది.

సీఐడీ విచారణ, పేపర్ లీకేజి వ్యవహారం ఇవన్నీ ఒక ఎత్తయితే.. దాదాపు 50 వేల మంది విద్యార్థుల భవిష్యత్తు మరో ఎత్తని.. అందువల్ల ఈ విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు. దీంతో లీకేజి తీవ్రత విద్యార్ధులపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో అనే దానిపై దృష్టి సారించారు.

ఎలాంటి ప్రత్యామ్నాయాలను అవలంభిస్తే విద్యార్ధులకు న్యాయం జరుగుతుందో అనే దానిపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. సమావేశంతరం దీనిపై ఒ స్పష్టమైన ప్రకటనను ప్రభుత్వం చేయనున్నారు. వైద్య విద్యకు సంబంధించిన క్లాసులను క్లాసులను కూడా ప్రారంభించాల్సి రావడంతో వీలైనంత త్వరగా ఈ పరీక్ష విషయమై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఎంసెట్ 2 పరీక్షను రద్దు చేయడానికే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఎవరో కొంతమంది చేసిన తప్పునకు అందరినీ ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన అన్నారు. మరోవైపు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఎంసెట్ 2 లీకేజి నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు.

ఈ కేసులో ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి, విష్ణు, రమేశ్, తిరుమల్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకుని నగరంలోని సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ లీకేజి వ్యవహారంపై రేపు తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. సీఐడీ నివేదిక అందిన తర్వాత ఎంసెట్ రద్దుపై తెలంగాణ ప్రభుత్వం రేపు నిర్ణయం తీసుకోంది.

ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజగోపాల్ రెడ్డి మొత్తం 160 క్వశ్చన్లతో కూడిన ప్రశ్నాపత్రాన్ని ప్రత్యేక జిరాక్స్ మిషన్‌లో తీయించి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రశ్నాపత్నం ఇచ్చినందుకు గాను ఒక్కో విద్యార్ధి నుంచి రూ. 40 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు అగ్రిమెంట్ కుదుర్చుుకున్నట్లుగా తెలుస్తోంది.

ఎంసెట్ 2 లీకేజి కేసు వ్యవహారంలో మొత్తం 69 మంది విద్యార్ధులు లబ్ధి పొందినట్లుగా తెలుస్తోంది. ఈ లీకేజి డీల్ విలువ మొత్తం రూ. 50 కోట్లు. ఎంసెట్ 2 పేపర్ లీకేజిలో సంచలనాలు వెలుగు చూస్తున్నాయి. పేపర్ లీకేజికి ముందు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 10 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నారు.

ఎంసెట్ 2 లీకేజి కేసులో లబ్ధి పొందిన విద్యార్ధుల ర్యాంకులు ఇలా ఉన్నాయి. ఏపీ ఎంసెట్, టీఎస్ ఎంసెట్ 2కు హాజరైన విద్యార్ధుల ర్యాంకుల్లో భారీ తేడాలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఈ తేడాలను బట్టే విద్యార్ధుల తల్లిదండ్రుల ఆందోళన చేయడంతో ఎంసెట్ 2 లీకేజి వ్యవహారం వెలుగుచూసింది.

 పేరు  ఏపీ ఎంసెట్   టీఎస్ ఎంసెట్ 2
 కాలగొట్ నిఖిత  17498  1654
 మద్దినేని ఆకాశ్  26433  1000
 కోపసం సాయి సుమంత్  27245  957
 జి.శ్రీజ  37221  1475
 చిన్న నరేశ్ కుమార్  28856  1726
 మంకు సాయి శ్రీజా  17675  1818
 పంగులూరి వెంకటేశ్  14169  1069
 అభినందిత తామడ  12330  1795
 ఆర్ నేహా శివానీ  13698  23
 కూన అవినాశ్ కుమార్  17574  569
 రాహుల్ పి.ఎస్.డి  38574  152

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ramesh Kumar and Dayakar, two agents believed to have been connected to EAMCET paper-II leakage, were grilled by the Telangana Crime Investigation Department (CID) officials on Tuesday but no clarity emerged on the persons behind it.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి