తెలంగాణలో రేవంత్ సీఎం అయ్యాక ఏపీలో ఏం జరగబోతోంది? ఎల్లుండే తేలిపోతుందా?
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం నేపథ్యంలో సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. ఎల్లుండి ఆయన తెలంగాణ మూడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. ఇంతవరకూ బాగానే ఉన్నా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఏపీలో ఏం జరగబోతోందన్న ప్రశ్న తలెత్తుతోంది. ముఖ్యంగా మరో నాలుగు నెలల్లో ఏపీలో జరిగే ఎన్నికలపై రేవంత్ రెడ్డి ప్రభావం ఎలా ఉండబోతోందన్న చర్చ జరుగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపడుతున్న నేపధ్యంలో ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రభావం ఏ మేరకు ఉండబోతోందన్న చర్చ మొదలైంది. ఎందుకంటే గతంలో టీడీపీలో పనిచేసిన ఆయన నేపథ్యం, చంద్రబాబు శిష్యుడిగా ఎదిగిన వైనం, ఆయనతో ఉన్న సంబంధాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సామాజిక వర్గం అయినా ఆయనకు బద్ద విరోధి కావడం వంటి పరిణామాల్లో రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక ఏం చేయబోతున్నారనే చర్చ సాగుతోంది.

ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్ మినహా మిగిలిన ప్రాంతాల్లో ఏపీ సెటిలర్లు, ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులంతా కాంగ్రెస్ పార్టీకే ఓటేశారు. అంతే కాదు కాంగ్రెస్ గెలిచాక గాంధీ భవన్ లో మువ్వన్నెల జెండాలతో పాటు పసుపు జెండాలు కూడా కనిపించాయి. ఎన్నికల ప్రచారంలోనూ చాలా చోట్ల ఇదే పరిస్ధితి. చంద్రబాబు చెప్పారో లేదో తెలియదు కానీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ నేతలంతా కాంగ్రెస్ కు మద్దతుగా రంగంలోకి దిగడమే కాకుండా ఓట్లు కూడా వేయించారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలవడంతో ఇప్పుడు వారంతా ఏపీ ఎన్నికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
దీంతో ఏపీలో అధికార వైసీపీ కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా కూకట్ పల్లిలో శిబిరాలు ఏర్పాటు చేసి మరీ ఏపీలో ఓటర్లుగా నమోదు చేయిస్తున్న తీరుపై వైసీపీ నేతలు ఇవాళ ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. దీంతో రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతోందో హింట్ అందుతోంది. ముఖ్యంగా ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుకు కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఇప్పుడు రేవంతా్ రెడ్డి ఏపీలో జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారా అన్న చర్చ సాగుతోంది.
చంద్రబాబు శిష్యుడిగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు టీడీపీతో నేరుగా అంటకాగే అవకాశం లేకపోయినా ఆయన ప్రమాణస్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. అలాగే సీఎం జగన్ ను కూడా ఆహ్వానించే అవకాశముంది. అలాగే ఏపీలో కాంగ్రెస్, టీడీపీ ఇప్పటికే అమరావతి ఉద్యమంలో కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ తెలంగాణ సీఎం అయితే ఈ బంధం మరింత బలపడే అవకాశముంది. అదే జరిగితే జనసేన కూడా కాంగ్రెస్, టీడీపీలతో కలిసి ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఎలాగో దక్షిణాదిన బీజేపీ ప్రభావం తగ్గిందని తేలిపోయింది. ఈ పరిణామాలన్నీ అంతిమంగా వైసీపీని కలవరపెడుతున్నట్లు తెలుస్తోంది.
-
దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం: సీఎం రేవంత్ రెడ్డి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications