పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ ఎప్పుడు? పోరుబాటలో ప్రతిపక్షాలు
తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ స్కీమ్‌లో భాగంగా నిర్మించిన ఇళ్లలో 18% మాత్రమే రాష్ట్రంలోని లబ్ధిదారులకు అందజేసింది. కరీం అన్సారీ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టంద్వారా ఈ వివరాలను తెలుసుకున్నారు. బుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం విషయంలో ప్రభుత్వం వాగ్దానం చేసిన మేరకు పంపిణీ చేయలేదని, జీహెచ్‌ఎంసీ పరిధిలో చాలా ఇళ్లు సిద్ధంగా ఉన్నప్పటికీ కొన్నింటిని మాత్రమే లబ్ధిదారులకు అందజేశారని, ఎన్నికల కోసమే ప్రభుత్వం వాటిని దాచివుంచినట్లుగా అర్థమవుతోందని అన్సారీ తెలిపారు.

kcrకు ప్రతిష్టాత్మకం
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ పథకాన్ని 2015లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. రాష్ట్రంలో ఇళ్లులేని బీపీఎల్ కుటుంబాలకు వీటిని ఇస్తామని హామీ ఇచ్చారు. నిర్మాణం పూర్తిచేసుకొని సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఇంతవరకు ఒక్క 2బీహెచ్‌కే కూడా లబ్ధిదారులకు అందజేయలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై కమ్యూనిస్టులు పోరాటానికి సిద్ధమవుతున్నారు.

జీహెచ్ఎంసీలో కేవలం 5 శాతం మందికే..
జోగులాంబ గద్వాల్ జిల్లాలో 605 ఇళ్లు, నాగర్‌కర్నూల్‌లో 390, ఆదిలాబాద్‌లో 596, కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లో 8, పెద్దపల్లిలో 262, జయశంకర్ భూపాలపల్లిలో 930, యాదాద్రి భోంగిర్‌లో 481, మేడ్చల్‌లో 677 ఇళ్లు పూర్తయి సిద్ధంగా ఉన్నాయి. ఇతర జిల్లాల్లో ఇళ్లు సిద్ధంగా ఉన్నా తక్కువ సంఖ్యలో మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. మెదక్‌లో 2,245 ఇళ్లు సిద్ధమవగా కేవలం 128 మంది లబ్ధిదారులకే అందజేశారు. కామారెడ్డిలో 4,198 2బిహెచ్‌కెలుండగా 651 మందికి అందజేశారు. నిజామాబాద్‌లో 2141 ఇళ్లు మంజూరైతే మొత్తం 207 ఇళ్లు నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వం 56,066 ఇళ్లు నిర్మించగా లబ్ధిదారుల సంఖ్య కేవలం 5 శాతంగానే ఉంది.

లబ్ధిదారులకు కచ్చితంగా అందుతాయి
ఇళ్లు పంపిణీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనగాల మహేష్ అభిప్రాయపడ్డారు. ఈ పథకాన్ని రాజకీయ మైలేజీకి ఉపయోగించుకోవాలనే కేసీఆర్ అత్యాశ వల్ల తెలంగాణలో చాలా మంది పేదలు నిరాశ్రయులయ్యారని, ఈ ఇళ్లను కేటాయించడానికి కేసీఆర్ కచ్చితంగా సాధారణ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. అయితే మహేష్ వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఒకరు ఖండించారు. పనులు జరుగుతున్నాయనే విషయాన్ని లబ్ధిదారులు అర్థం చేసుకుంటారని, వారికి ఏదో ఒకరోజు వారి ఇల్లు కచ్చితంగా అంది తీరుతుందన్నారు.
Recommended Video


హామీని అమలు చేయడంలో విఫలం
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కంటే ఆడంబరాలు, ప్రచారాలపైనే కేసీఆర్ ప్రభుత్వం ఆధారపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టెక్కలపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వరంగల్‌లో జరిగిన పార్టీ కౌన్సిల్ సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలవుతున్నప్పటికీ పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు అనే ప్రధాన హామీని అమలు చేయడంలో విఫలమైందన్నారు. కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. భావ సారూప్యత కలిగిన పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి పోరాటానికి సిద్ధమవతున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications