వీవీఐపీ దర్శనానికి వెళ్తుంటే.. మేడారం జాతరలో మాజీ మంత్రి ఎర్రబెల్లికి షాక్!!
మేడారం జాతరలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు షాక్ తగిలింది. నిన్న పాలకుర్తి నియోజకవర్గంలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బస్సులో మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరకు వెళ్ళారు. ఈ క్రమంలో ఆయన వివిఐపీ దర్శన మార్గంలో వెళ్తున్న సమయంలో ఆయనను ప్రజలు నిలదీసిన ఘటన చోటుచేసుకుంది.
మేడారం జాతరలో గద్దెలపై కొలువైన ఒక సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భక్తజనం పోటెత్తారు. నిన్న ఒక్కరోజే మేడారం జాతరలో 50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇక సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళిసై అమ్మవార్లను దర్శించుకున్న క్రమంలో సాధారణ భక్తుల క్యూ లైన్లను గంటలకొద్దీ నిలిపివేశారు. ఒక్కరోజే వీవీఐపీల తాకిడి పెరగడంతో సాధారణ భక్తులు దర్శనం చేసుకోవడానికి ఇబ్బందిని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో నిన్న వీవీఐపీ మార్గంలో అమ్మవారిని దర్శించుకోవడానికి వెళుతున్న క్రమంలో ఎర్రబెల్లిని భక్తులు నిలదీశారు.
మేము క్యూలైన్లో నిలబడి నాలుగు గంటలు అయింది. ఇప్పటివరకు మాకు అమ్మవారి దర్శనం కాలేదు. మీరు మాత్రం డైరెక్ట్ గా దర్శనానికి వెళుతున్నారు.. మీరు ఎవరికి వివిఐపి.. సాధారణ ప్రజలు అంటే మీకు లెక్క లేదా అంటూ మండిపడ్డారు. దీంతో మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహంలో ఉన్న భక్తులను అనునయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ భక్తులు శాంతించకపోవడంతో చేసేదేమి లేక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదిలా ఉంటే నిన్న ఒక్కరోజు మేడారం జాతరలో భక్తుల సౌకర్యాల లేమితో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక మేడారానికి వెళ్లే వారు వచ్చేవారు అడుగడుగున ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొన్నారు. పోలీసుల అత్యుత్సాహంతో చాలామంది భక్తులు గాయాల పాలై పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలైన్లలో నిలుస్తున్న నిలుచున్న పరిస్థితిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.నిన్న తాడ్వాయి నుంచి మేడారం వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications