క్యాన్సర్ ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధి.!అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న విప్ గొంగిడి సునిత.!
హైదరాబాద్ : క్యాన్సర్ మహమ్మారిపై విస్తృతంగా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్ గొంగిడి సునిత పేర్కొన్నారు. అశ్విన్స్ క్యాన్సర్ కేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో సునిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మాట్లాడారు. బయట షాపుల్లో విక్రయించే తినుబండారాల వల్లే క్యాన్సర్ ఎక్కువగా విస్తరిస్తుందని పేర్కొన్నారు. చాక్లట్లు, ఫాస్ట్ ఫుడ్, వైట్ ఘగర్, జంక్‌ఫుడ్ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలని, వాటి వినియోగం తగ్గించుకోవాలని సూచించారు. జీవితంలో చోటు చేసుకున్న, టెన్షన్లు, ఉరుకుల పరుగుల జీవితం, జీవన వైవిధ్యాలు క్యాన్సర్ భారినపడేలా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు గొంగిడి సునీత.













Click it and Unblock the Notifications