
Kcr భారత రాష్ట్ర సమితి(BRS)వెనక ఉన్నది ఎవరు?
BRS:తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం స్పష్టమైంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిందేమీ లేదని, ప్రజలకు సమన్యాయం ఉండాలంటే ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటవ్వాలనే ఆకాంక్షను కేసీఆర్ కొద్దిరోజులుగా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంతో కాగితాలపై సంతకం పెట్టిన కేసీఆర్ దేశ రాజకీయ యవనికపై ఇకనుంచి కొత్త పాత్ర పోషించబోతున్నారు.

నెలాఖరున ఢిల్లీలో పార్టీ ప్రకటన?
కేసీఆర్
బీఆర్ఎస్
వెనక
రాజకీయ
పార్టీల
వ్యూహకర్త
ప్రశాంత్
కిషోర్
ఉన్నట్లు
సమాచారం.
పార్టీలకు
సేవలందించడం
మానేసిన
ప్రశాంత్
కిషోర్
కాంగ్రెస్
పార్టీలో
ఒక
మంచి
స్థానంతోపాటు
ఆ
పార్టీని
అధికారంలోకి
తేవడానికి
ఒక
ప్రణాళిక
రూపొందించారు.
దశాబ్దాల
చరిత్ర
ఉన్న
పార్టీని
ఒక
వ్యక్తి
చేతిలో
పెట్టడం
అనేది
అభ్యంతరకరమంటూ
రాహుల్‌గాంధీ
అభిప్రాయపడటంతో
ఆ
ప్రయత్నం
విఫలమైంది.
అక్టోబరు
రెండోతేదీ
నుంచి
ఆయన
బీహార్
లో
జనసురాజ్
పేరుతో
యాత్ర
చేస్తున్నారు.
దాదాపు
3వేల
కిలోమీటర్లు
నడవాలని
లక్ష్యంగా
పెట్టుకున్నారు.
ఆ
తర్వాత
రాజకీయాలకు
సంబంధించి
ఒక
నిర్ణయం
తీసుకుంటానని
ప్రకటించారు.
మొన్నటివరకు
టీఆర్ఎస్
కు
వ్యూహకర్తగా
పనిచేసిన
పీకే
అవసరం
తనకు
లేదని
కేసీఆర్
భావించడంతో
ఐప్యాక్
హైదరాబాద్
ను
ఖాళీచేసి
వెళ్లిపోయింది.
ఈ
బృందాలన్నీ
ఏపీలో
వైసీపీ
కోసం
పనిచేస్తున్నాయి.

సత్సంబంధాలున్న సమయంలో..
కేసీఆర్
కు,
పీకేకు
సత్సంబంధాలున్న
సమయంలో
జాతీయ
రాజకీయ
పార్టీ
చర్చ
నడిచింది.
పీకేతో
పనిచేసిన
సమయంలో
అతన్ని
ఆకళింపు
చేసుకున్న
కేసీఆర్
రాష్ట్రం
వరకైతే
పీకే
అవసరంలేదని,
తాను
సరిపోతానని
భావించడంతో
ఒప్పందానికి
ముగింపు
పలికారు.
ఎందుకంటే
రాజకీయాల్లో
వ్యూహాలను
అమలుచేయడంలో
గండర
గండడుగా
కేసీఆర్
పేరు
తెచ్చుకున్నారు.
దీంతో
తాను
సరిపోతానని
భావించారు.

రాష్ట్ర వ్యవహారాలన్నీ కేటీఆర్ చేతిలోనే!
రాష్ట్రంలో
పాలనా
వ్యవహారాలు,
పార్టీ
వ్యవహారాలన్నీ
కేసీఆర్
తనయుడు
కేటీఆర్
చూసుకుంటున్నారు.
ఇకనుంచి
కేసీఆర్
తన
పూర్తిసమయాన్ని
జాతీయ
రాజకీయాలకు
కేటాయించబోతున్నారు.
దేశవ్యాప్తంగా
తెలంగాణ
మోడల్‌ను
ప్రచారం
చేసేందుకు
కేసీఆర్
ప్రణాళిక
రూపొందించుకున్నారు.
అందుకు
తగ్గట్లుగానే
దేశవ్యాప్తంగా
ఉన్న
అన్ని
మీడియాల్లో
తెలంగాణ
రాష్ట్ర
ఆవిర్భావ
దినోత్సవాన్ని
పురస్కరించుకొని
భారీగా
ప్రకటనలు
ఇచ్చారు.
ముందుగా
మీడియా
ఫ్రెండ్లీగా
బీఆర్ఎస్
మారాలని,
ఆ
తర్వాత
వారినుంచి
మంచి
కవరేజ్
పొందవచ్చనేది
కల్వకుంట్ల
ఆలోచనగా
ఉంది.

పార్టీ ప్రకటించారు.. తర్వాత కీలక నిర్ణయం
రాష్ట్ర
పతి
ఎన్నికల్లో
అన్నాహజారేను
నిలబెట్టాలనుకున్నప్పటికీ
పరిస్థితులు
అనువుగా
లేకపోవడంతో
కేసీఆర్
సైలెంటయ్యారు.
దేశంలో
భారతీయ
జనతాపార్టీ
ఆగడాలు
శృతిమించిపోతున్నాయని,
మోడీ,
అమిత్
షాకు
అడ్డుకట్ట
వేసి
ప్రజాస్వామ్యాన్ని
కాపాడాలంటే
బీఆర్
ఎస్
ఒక్కటే
ప్రత్యామ్నాయ
వ్యవస్థ
అవుతుందనేది
కేసీఆర్
ఆలోచనగా
టీఆర్ఎస్
వర్గాలు
వెల్లడించాయి.