కూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పేసిన చంద్రబాబు..! రిలాక్స్ అవుతున్న కాంగ్రెస్..!
హైదరాబాద్ : తెలంగాణ ముందస్తు ఎన్నికల ఘడియలు దగ్గర పుడుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచేసాయి. అదికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూసుకెళ్తుంటే మహాకూటమి తరుపున ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏపార్టీ గెలుస్తుందో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా తేల్చి చెప్పుకొస్తున్నారు. రాజేంద్రనగర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మహాకూటమి భవిష్యత్తును చెప్పేసారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా తేల్చేసారు చంద్రబాబు నాయుడు.

గ్రేటర్ లో చంద్రబాబు ఉద్రుత ప్రచారం..! రెండు నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటన..!!
పార్టీ మారిన వాళ్లు చరిత్రహీనులుగా మిగిలి పోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తెలంగాణ రాష్ట్రంలోని రాజేంద్రనగర్ టీడీపీ అభ్యర్ధి గణేష్ గుప్తా గెలుపును కాంక్షింస్తూ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి పలు కూడళ్లలో ప్రసంగించారు. నాకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్రం కోసం ఇక్కడే ఉండిపోయా అని చంద్రబాబు చెప్పారు.

తెలంగాణ ఇంకా అభివ్రుద్ది చెందాలి..! అందుకు కూటమి గెలావాలన్న బాబు..!!
తెలంగాణలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే తన పెత్తనం ఉంటుందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని, నేను మళ్లీ ఇక్కడకి ఎందుకు వస్తానని, నేను ఏపీలో ఉంటానని చెప్పారు. నేను ఇక్కడికి రాలేకపోయినా తెలంగాణలో మంచి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటానని చెప్పారు. కేసీఆర్ కు ఓడిపోతున్నామనే భయం పట్టుకుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి మహాకూటమి అభ్యర్ధులను గెలిపించాలని పిలుపునిచ్చారు. నా విజన్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసిందని చెప్పిన చంద్రబాబు మోడీ పద్దతి లేని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

మహాకూటమి అభ్యర్థులు గెలవాలి..! టీడిపికి ప్రజాబలం ఉందన్న బాబు..!!
ఐతే మహాకూటమి అభ్యర్థుల గెలుపులో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ఉద్రుతం చేసింది. అటు కాంగ్రెస్ పార్టీ తురుపున ఇటు తెలుగుదేశం పార్టీ తరుపున పార్టీ ముఖ్యనేతలతో పాటు, ఆ పార్టీ జాతీయ అద్యక్షడు చంద్రబాబు నాయుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. మొన్న ఖమ్మం, శేరిలింగంపల్లి నియోజక వర్గాల్లో పర్యటించిన బాబు నేడు రాజేంద్రనగర్, కూకట్ పల్లి నియెజకవర్గాల్లో పర్యటిస్తున్నారు.

ముఖ్యమంత్రి ని తేల్చిన బాబు..! కాంగ్రెస్ కే అవకాశం..!!
ఐతే మొదటినుండి తెలంగాణ ముఖ్యమంత్రి కేటీఆర్ చంద్రబాబును విమర్శిస్తున్నప్పటికి బాబు మత్రం చంద్రశేఖర్ రావు కు ఏ మాత్రం కౌంటర్ ఇవవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలకు తావు లేకుండా అప్రమత్తంగా తన ప్రసంగాలను కొనసాగిస్తున్నారు చంద్రబాబు. ఐతే ఈరోజు రాజేంద్రనగర్ రోడ్ షో సందర్బంగా ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి గెలుస్తోందని, గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో కూడా వివరించి అందరి ద్రుష్టిని ఆకర్శించారు చంద్రబాబు. మహాకూటమి గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతారని చంద్రబాబు జోష్యం చెప్పి కూటమిలో నెలకొన్న సందేహాన్ని యాద్రుచ్చికంగా నివ్రుత్తి చేసారు చంద్రబాబు. దీంతో కూటమి నేతలు తమకు ప్రధానంగా ముఖ్యమంత్రి విషయంలో మిత్రపక్షం నుండి ఎలాంటి పోటీ లేదని సంబరపడిపోతునప్నట్లు తెలుస్తోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications