Earth Quake: భూ కంపాలు ఎందుకు వస్తాయి.. ఎక్కడ ఎక్కువగా వస్తాయంటే..!
బుధవారం ఉదయం తెలుగు రాష్ట్రాలను భూ ప్రకంపనలు కలవర పెట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ పలు చోట్ల ప్రకంపనలు రావడంతో జనాలు బయటకు పరుగులు పెట్టారు. అయితే భూ కంపాలు ఎందుకు వస్తాయో తెలుసుకుందాం. భూమి క్రస్ట్‌లో టెక్టోనిక్ ప్లేట్లు ఉంటాయి. మన భాషలో చెప్పుకోవాలంటే.. ప్లేట్లు ఉంటాయి. ఇవి నిరంతరం అత్యంత నెమ్మదిగా కదులుతాయి. ఒక్కోసారి వీటి కదలికలు వేగంగా జరిగినప్పుడు భూ కంపాలు వస్తాయి. వీటి తీవ్రత పలకాలు ఢీకునే స్పీడ్, అలాగే లోతును బట్టి ఉంటుంది.
ఎక్కువ లోతులో భూకంప కేంద్రం ఉంటే తీవ్రత కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్లేట్ల కదలడంతో పాటు భూగర్భజలాల ప్రవాహంలో మార్పుల వల్ల కూడా ప్రకంపనలు వస్తాయి. ఇక సముద్రంలో భూకంపం వస్తే దాన్న సునామీగా పరిగణిస్తారు. అంటే సముద్రం అడుగు భాగంలో భూమి ఉంటుంది. ఆ భూమికి కింద ప్రకంపనలు రావడం వల్ల సునామీ వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలో భూకంపం వచ్చే ప్రాంతాలను తీవ్రత ఆధారంగా వర్గీకరించారు.
జోన్ 2, 3, 4, 5లుగా విభజించారు.

అధిక తీవ్రతతో వచ్చే భూకంపాలు ప్రాంతాలను జోన్ 5లో చేర్చారు. ఇందులో హిమాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్‌లోని తూర్పు భాగం, గుజరాత్‌లోని కచ్, ఉత్తర బీహార్‌లో కొంత భాగం, భారతదేశంలోని అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ & నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
ఇక జోన్ 4లో భారీ భూకంపాలు వచ్చే ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో లడఖ్, జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర భాగం, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
జోన్ 4 కంటే తక్కువ తీవ్రత వచ్చే ప్రాంతాలను జోన్ 3 చేర్చారు. ఇందులో ఉత్తరప్రదేశ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాలు, కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, గుజరాత్, పంజాబ్‌లోని కొన్నిప్రాంతాలు, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్‌లోని పలు ప్రాంతాలు, ఉత్తర జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర,లోని కొంత భాగం, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ఏరియాలు, తమిళనాడు కర్ణాటకలోని కొంత భాగం ఇందులో ఉన్నాయి.
చాలా తక్కవ తీవ్రత వచ్చే భూకంప ప్రాంతాలను జోన్ 2లో చేర్చారు. ఇందులో తెలంగాణలోని కొంత భాగం, ఏపీలోన కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొంత భాగం కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానాలోని కొంత భాగం ఇందులో ఉన్నాయి. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. జోన్ 2లో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో అత్యంత భూకంపం రావడం అరదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications