వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వన్ నేషన్..వన్ హెల్త్ పాలసీని ఎందుకు ప్రకటించడం లేదు.?కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించిన ఎంపి రేవంత్ రెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా కష్ట కాలంలో వాక్సీన్ ల అంశంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను తప్పుబట్టారు. దేశమంతా ఒకే హెల్త్ పాలసీని కేంద్రం ఎందుకు ప్రకటించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రధానంగా ప్రస్తుత కష్ట కాలంలో ఉచితంగా అందించాల్సిన కరోనా వ్యాక్సీన్ ను 600వందల రూపాయలకు విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి పూర్తిగా వ్యతిరేకించారు. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజానికానికి వ్యాక్సీన్ ధర మరింత భారం కాకుండా ఉండాలంటే వ్యాక్సీన్ ను కేవలం 150రూపాయలకే అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు.

 వ్యాక్సీన్ రేటును తగ్గించాలి.. కేంద్రానికి సూచించిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి..

వ్యాక్సీన్ రేటును తగ్గించాలి.. కేంద్రానికి సూచించిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి..

అంతే కాకుండా వ్యాక్సిన్ ఉత్ప‌త్తి సంస్థ‌లను కేంద్ర ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకొని వాటి నుండి ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ ను ప్ర‌జ‌ల‌కు ఉచితంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. వ్యాక్సిన్ ఉత్పత్తి అయ్యే సంస్థలకు తగిన ప్రోత్సహకాలు అందించి ఉత్పత్తిలో రాజీ పడకుండా కేంద్రం తగు చర్యలు చేపడితే అనుకున్న సమయంలోపు తగినంత వ్యాక్సీన్ అందుబాటులోకి వస్తుందని రేవంత్ రెడ్డి సూచించారు. దీంతో పాటుగా ప్రజలకు మనో ధ్యైర్యం నింపేందుకు ప్రధాన మంత్రి కేర్ ఫండ్ ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం క‌రోనా రోగుల‌కు అందించే విధంగా ఫాల‌సీ తీసుక‌రావాలని రేవంత్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

 మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. కాలేజీల్లో కరోనా బాదితులకు చికిత్స అందించాలన్న రేవంత్..

మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. కాలేజీల్లో కరోనా బాదితులకు చికిత్స అందించాలన్న రేవంత్..

కాగా తెలంగాణలో ఉన్న మెడిక‌ల్ కాలేజ్‌ల‌నూ ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకుని క‌రోనా వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఆసుపత్రులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని, కరోనా బాదితులకు సరిపోయే బెడ్లు, ఆక్సీజన్ సిలిండర్లు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. అలాంటి వారి కోసం మెడికల్ కాలేజీలను ప్రభుత్వం స్వాదీనం చేసుకొని మెరుగైన చికిత్స అందిస్తే ప్రాణనష్టాన్ని నివారించొచ్చని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో ఉన్న 22 మెడిక‌ల్ కాలేజీల‌నూ ప్ర‌భుత్వం క‌రోనా కోసం వినియోగించుకోవ‌డం లేదని, తక్షణమే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే ఆసుపత్రుల్లో నెలకొన్న బెడ్ల కొరత కొంతైనా తీరుతుందని రేవంత్ రెడ్డి సూచించారు.

 ప్రభుత్వానికి, వైద్య శాఖ అధికారులకు సమన్వయం లేదు.. అసహనం వ్యక్తం చేసిన రేవంత్

ప్రభుత్వానికి, వైద్య శాఖ అధికారులకు సమన్వయం లేదు.. అసహనం వ్యక్తం చేసిన రేవంత్

అంతే కాకుండా ప్ర‌భుత్వం తీసుకొచ్చిన డ్యాష్ బోర్డు ఎక్క‌డా ఉంది అని ఎంపీ రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. మెడిక‌ల్ డైరెక్ట‌ర్ చెప్పే అంశాలకు, ఆరోగ్య శాఖా మంత్రి ఈట‌ల రాజేందర్ చెప్పే అంశాలకు పొంతన లేకుండా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ప్రభుత్వ శాఖల మధ్య, ప్రధానంగా కోవిడ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో వైద్య శాఖ అధికారులకు, ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం శోచనీయమని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ప్రైవేట్ ఆస్ప‌ప‌త్రుల్లోని బెడ్లను ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకొని ఆయా అసుపత్రులు పాల్పడుతున్న వ్యాపారాల కలాపాలకు చెక్ పెట్టాలని రేవంత్ రెడ్డి కోరారు.

 వ్యాక్సిన్ ధ‌ర‌ల వ్యత్యాసంతో అయోమయం..బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లే ప్రమాదముందన్న రేవంత్ రెడ్డి..

వ్యాక్సిన్ ధ‌ర‌ల వ్యత్యాసంతో అయోమయం..బ్లాక్ మార్కెట్ కు తరలి వెళ్లే ప్రమాదముందన్న రేవంత్ రెడ్డి..

అంతే కాకుండా కేంద్రం నిర్దారించిన ధ‌ర‌ల వ్యత్యాసంతో క‌రోనా వ్యాక్సిన్ బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌లి వెళ్లే ప్రమాదం ఉందని ఎంపీ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలాగే
టిఆర్ఎస్ నాయ‌కుల మెడిక‌ల్ కాలేజీల్లో ఎందుకు క‌రోనా వైద్యం అందించ‌డం లేదని, గులాబీ నేతలకు ఓ న్యాయం, మిగతా సామాన్యులకు మరో న్యాయమా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కరోనా కష్టం కాలంలో అధికారులు, ప్రభుత్వం ప్రజలను అయోమయానికి గురి చేయకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని అన్నారు. కరోనా అంశంలో కేంద్ర ప్రభుత్వం కూడా తిన స్పష్టతతో ముందుకు వెళ్తున్నట్టు కనిపించడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.

English summary
Malkajgiri MP Revanth Reddy blamed the Centre's policies on vaccines during the Corona crisis. He was outraged as to why the Center could not announce a single health policy across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X