రేవంత్ రెడ్డి రూటే సపరేటు!: కాంగ్రెస్‌లోకి ఎందుకు, ఇవీ కారణాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయి. రేవంత్ కోసం పలు పార్టీలు గాలం వేశాయి. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీకి చిక్కారు!

  Revanth Reddy Says Goodbye To TDP రేవంత్‌తో పాటు 25మంది ? | Oneindia Telugu

  చదవండి: ఏంచేశాడు: రేవంత్ రెడ్డికి 'కొడంగల్' షాక్, చేరికపై హడావుడి ఎందుకు: సీఎల్పీలో నిలదీత

  బిజెపిలోకి వస్తే ఆయనను తీసుకొని కచ్చితంగా మంచి పదవి ఇచ్చేవారని అంటున్నారు. ఆయనకు టీఆర్ఎస్ నుంచి కూడా ఆహ్వానం అందిందని అంటున్నారు.

  చదవండి: సొంత ఇలాకాలో 'ముందే' దెబ్బ: రేవంత్‌ని దెబ్బతీసేందుకు టిఆర్ఎస్ పక్కా స్కెచ్

  కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. తెలంగాణలో టిఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ రెండు పార్టీలను కాదని కాంగ్రెస్‌లోకి ఎందుకు వెళ్తున్నారనే చర్చ సాగుతోంది. దానికి పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.

  చదవండి: ఇదే మంచిది: అప్పుడే రేవంత్ రెడ్డి రెండు కీలక ప్రతిపాదనలు, బాబు ఒకే చెప్పి ఉంటే

  కేసీఆర్‌పై ఆగ్రహం

  కేసీఆర్‌పై ఆగ్రహం

  మోత్కుపల్లి నర్సింహులు వంటి నేతలు టిఆర్ఎస్‌తో పొత్తుకు సిద్ధమంటున్నారు. కానీ రేవంత్ రెడ్డికి అది ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. అందుకు పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో తనను ఇరికించి జైలుకు పంపించారనే ఆగ్రహం కేసీఆర్ పైన రేవంత్‌కు ఉందంటున్నారు.

  లీడర్‌షిప్ కోరుకుంటారు

  లీడర్‌షిప్ కోరుకుంటారు

  అదే విధంగా రేవంత్‌‌ది దూకుడుతనం. లీడర్‌షిప్‌లోను ప్రత్యేకత కోరుకుంటారు. తెలంగాణలో టిడిపి అంటే రేవంత్ గుర్తుకు రావడానికి అదే కారణం. టిఆర్ఎస్‌లో పని చేస్తే గుంపులో గోవింద అవుతుంది. అదే సమయంలో చంద్రబాబు ఇంతకాలం తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందువల్ల తెలంగాణలో.. టిడిపి అంతగా లేకున్నా దూకుడు ప్రదర్శించారని అంటున్నారు.

   చంద్రబాబు నమ్మకం ఉంచారు, స్వేచ్ఛ ఇచ్చారు

  చంద్రబాబు నమ్మకం ఉంచారు, స్వేచ్ఛ ఇచ్చారు

  చంద్రబాబు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారనడానికి కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. టి-టిడిపిలో ఇంతకాలం రేవంత్ హవా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలోను.. తనకు చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, నమ్మకం ఉంచారని, అందుకే తాను ఆయనకు మాత్రమే వివరణ ఇస్తానని రేవంత్ స్పష్టం చేశారు.

  కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం వెనుక

  కాంగ్రెస్‌లో చేరాలనుకోవడం వెనుక

  ఇక కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకోవడానికి కూడా కారణం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చే పార్టీ దాదాపు లేదనే చెప్పవచ్చు. టిడిపి, బిజెపిలకు అంత సామర్థ్యం లేదనేది కొందరి అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు. కానీ కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొనే నాయకుడు లేడని భావిస్తున్నారు. అది రేవంత్ రెడ్డితో భర్తీ అవుతుందని కాంగ్రెస్‌లోను మెజార్టీ నేతలు భావిస్తున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరితే కచ్చితంగా తనకంటూ ఓ గుర్తింపు ఉంటుందని రేవంత్ భావిస్తున్నారని అంటున్నారు.

  రేవంత్.. కాంగ్రెస్, ఒకరికి ఒకరు

  రేవంత్.. కాంగ్రెస్, ఒకరికి ఒకరు

  మరో కారణం కూడా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ అంటే రెడ్డి సామాజికవర్గం హవా ఎక్కువ. కాబట్టి అది కూడా కలిసి వస్తుంది. మరోవైపు, తాజా రాజకీయ పరిణామాలు కూడా రేవంత్ చేరికకు కారణంగా చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ 'వెల్‌కం' వ్యూహానికి తెరలేపారు. దానిని ధీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ వంటి నేత కావాలి. రేవంత్‌కు కాంగ్రెస్ వంటి పార్టీ కావాలని అంటున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Why Telangana Telugu Desam working president Revanth Reddy interest joining Congress?

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి