"ముందుంది క్రొకడైల్ ఫెస్టివల్: ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం.. రహస్యంగా ఏం వెలగబెట్టారు?"

Subscribe to Oneindia Telugu
Revanth Reddy Vs KTR : రేవంత్ వర్సెస్ కేటీఆర్ యుద్దం ఎంతదూరం వెళ్తుందో! | Oneindia Telugu

హైదరాబాద్: విషయమేదైనా నేరుగా కేసీఆర్‌ను ఢీకొట్టాలనే ప్రయత్నం ద్వారా రేవంత్ రెడ్డి మీడియా ఫోకస్‌ను తనవైపు తిప్పుకున్నారు. నిర్మాణాత్మక విమర్శలు లేకుండా కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మేదావులకు నచ్చకపోవచ్చు గానీ ఇప్పటికైతే దానివల్ల ఆయనకు కావాల్సినంత ఫోకస్ లభించింది.

ఏంటిదంతా?: రేవంత్‌ను నిలదీసిన రమణ, దబాయింపుగా రేవంత్.., వ్యూహాత్మకమా?

అయితే కేసీఆర్‌ను అధిగమించే స్థాయికి రేవంత్ చేరుకోవాలంటే ఇప్పుడున్న వైఖరినే కొనసాగిస్తే సరిపోతుందా? అంటే దానికి ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. రేవంత్ పార్టీ మారడం స్తబ్దుగా సాగుతున్న తెలంగాణ రాజకీయాలను రసవత్తరంగా మార్చిందని మాత్రం చెప్పవచ్చు.

వెరుపులేని రాజకీయమా?, వెనక్కి తగ్గడమా?: రేవంత్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే!..

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ వర్గానికి మధ్య మాటల యుద్దం మళ్లీ రాజుకున్నట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరికపై రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని కేటీఆర్ విరుచుకుపడితే.. రేవంత్ కూడా అదే స్థాయిలో ఆయనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 'ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం'

'ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం'

ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం అనే శీర్షికతో రేవంత్ తన అధికారిక ఫేస్ బుక్ లో ఒక పోస్టు చేశారు. '2016లో జ‌రిగిన అఫీషియ‌ల్ పోగ్రాంలో అన‌ఫీషియ‌ల్‌గా తేజారాజు S/O స‌త్యం రామ‌లింగ‌రాజుతో మ‌లేషియ‌న్ ప్ర‌ధానిని క‌లిసి మంత‌నాలాడిన స్కాంస్టార్‌ కేటీఆర్ కు ముందుంది 'క్రోకోడైల్ ఫెస్టివ‌ల్‌' అని పోస్టు ద్వారా ఘాటు రిప్లై ఇచ్చారు.

స్కాం స్టార్లతో ఎవరు తిరుగుతున్నారు?

స్కాం స్టార్లతో ఎవరు తిరుగుతున్నారు?

'స్కాములతో నిండిపోయిన కాంగ్రెస్ పార్టీలో చేరి స్కాం స్టార్లతో తిరుగుతున్నానని కేటీఆర్ తనపై రంకెలేస్తూ కేటీఆర్ రంకెలేస్తూ ఆవేశపడ్డారు. అయితే ఎవరు స్కాం స్టార్లతో తిరుగుతున్నారో చెప్పడానికి ఇదిగో తిరుగులేని సాక్ష్యం.. 2016 జులైలో పెట్టుబడుల సేకరణ పేరుతో కేటీఆర్ మలేషియాకు వెళ్లారు. అప్పటి ఫోటోనే ఇది' అంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.

 దొరకని దొంగ

దొరకని దొంగ

'అయితే అప్పటి అఫీషియల్ టూర్ ఫోటోల్లో ఈ ఫోటో ఎక్కడా కనిపించదు. ఈ ఫోటోలో కేటీఆర్, మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ తో పాటు కనిపిస్తున్న మూడో వ్యక్తి తేజా రాజు సన్నాఫ్ సత్యం రామలింగరాజు. వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డ సత్యం రామలింగరాజు సుపుత్రుడితో కేటీఆర్ మలేషియాలో రహస్యంగా వెలగబెట్టిన నిర్వాకం ఏమిటో ఆయనే చెప్పాలి. స్కాం స్టార్లతో తిరుగుతున్న దొరకని దొంగ ఎవరన్న 'సత్యం'ను తెలంగాణ సమాజం గుర్తించాలి.' అని రేవంత్ పోస్టులో పేర్కొన్నారు.

 నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు

నెటిజెన్స్ భిన్నాభిప్రాయాలు

సత్యం రామలింగరాజు స్కాంలో ఇరుక్కున్నంత మాత్రాన ఆయన తనయుడిని కూడా అదే గాటున గట్టి చూడాలా? అని కొంతమంది నెటిజెన్లు రేవంత్ పోస్టుపై కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం రేవంత్ బలంగా ఢీకొడుతున్నాడని ఆయన్ను ప్రశంసిస్తున్నారు. చూడాలి మరి రేవంత్ వర్సెస్ కేటీఆర్ యుద్దం ఎంతదూరం వెళ్తుందో!

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leader Revanth Reddy questioned KTR that why he met Satyam Ramalinga Raju's son secretly.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి