శాడిస్ట్ భర్త, బ్లూఫిలిమ్స్ చూపిస్తూ వికృత చేష్టలు

వరంగల్: వరంగల్ జిల్లాలో శాడిస్ట్ భర్త ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా భార్యను కట్టడి చేసి బయటకు వెళితే చంపే స్తానంటూ భార్య పాలిట శాడిస్టుగా మారాడు. అంతేకాదు, నిత్యం నీలి చిత్రాలు చూపిస్తూ వికృత చేష్టలతో నరకాన్ని చూపిస్తున్నాడు. తన శాడిస్టు చేష్టలతో జీవచ్ఛవంలా చేసిన భర్త నుండి తప్పించుకున్న భార్య పుట్టింటికి చేరుకుంది.

నర్సంపేట సబ్‌ డివిజనల్‌ పోలీసు కా ర్యాలయానికి తల్లి, బంధువులతో బాధితురాలు గురువారం రాత్రి చేరుకొని తనకు భర్త నుంచి రక్షణ కల్పించి, న్యాయం చేయాలంటూ స్థానిక డీఎస్పీని వేడుకుంది. ఈ సందర్భంగా బాధితురాలు సమీనాబేగం విలేకరులకు తన గోడును వెల్లబోసుకుంది.

గూడూరు మండలం బొద్దుగొండకు చెందిన మహ్మద్‌ జిలాని, ఖాజా బేగం దంపతుల కూతురు సమీనాబేగంకు 2009 మార్చిలో రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌ లోని ఎన్నంపల్లె ప్రాంతానికి చెందిన షేక్‌ ఖాజాపాషాతో వివాహమైంది. కొద్ది రోజుల వరకు బాగానే వున్న ఖాజాపాషా తర్వాత భార్య పట్ల శాడిస్ట్‌గా మారాడు.

wife alleged that her husband harassed her daily

ఏ పని లేకుండా చేయకుండా ఉన్న ఖాజాపాష సమీనాకు అక్రమ సంబంధాలను అంటగడుతూ బయటకు వెళ్లవద్దని కట్టడి చేసేవాడు. వీరికి ఒక కొడుకు ఇద్దరు కూతుర్లు వుండగా, భార్యతో పాటు చిన్నారులకు సైతం అన్నం సరిగా పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసేవాడు.

భార్యకు నీలి చిత్రాలను చూపిస్తూ వికృత చేష్టలతో నిద్రపోనిచ్చేవాడు కాదని భార్య రోదిస్తూ తెలిపింది. తన గర్ల్‌ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేసి వారితో మాట్లాడాలని వేధించేవాడని తెలిపింది. ఈ నెల 13న తన మర్డర్‌ కేసుకు ఖర్చుల కోసం పుట్టింటి నుంచి ఐదు లక్షలు తీసుకురావాలని లేదంటే, నిన్ను నీవాళ్లను చంపేస్తానంటూ తిండితిప్పలు లేకుండా గదిలో బంధించి బయట గొళ్లెం పెట్టి వెళ్లేవాడని తెలిపింది.

చుట్టు పక్కల వారిని ఎవరూ తన వద్దకు రాకుండా వారిని బెదిరించడంతో ఎవరూ తనను చూడడానికి సైతం రాలేదన్నారు.
ఈ నెల 9న భర్త బయటకు వెళ్లిన సమయంలో తన కుమారుడిచే గది గొళ్లెం తీసుకొని పిల్లలతో తప్పించుకొని భిక్షాటన చేసి వచ్చిన డబ్బులతో వచ్చేశానని తెలిపింది. తన భర్తకు శిక్షపడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తనను చంపేస్తాడంటూ భార్య వేడుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+