భర్త ప్రాణం తీసిన భార్య వివాహేతర సంబంధం
హైదరాబాద్: భార్య అక్రమ సంబంధం భర్త ప్రాణాన్ని బలిగొంది. ఓ మహిళ భర్తను దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం తూక్యానాయక్ తండాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
శాంతమ్మ, గోవింద్ నాయక్‌లు భార్యభర్తలు. అయితే శాంతమ్మ కొంతకాలంగా వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఈ విషయమై గోవింద్ నాయక్, ఆమెకు మధ్య గొడవ జరిగినవట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో గోవింద్ నాయక్ గురువారం రాత్రి బాగా మద్యం సేవించి ఇంటి ఆవరణలోని మంచంపై నిద్రించాడు. శుక్రవారం తెల్లవారుజామున శాంతమ్మ తన భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో గోవింద్ నాయక్ పెద్ద పెద్ద అరుపులు కేకలు పెట్టి మృతి చెందాడు.

ఇది గమనించిన స్ధానికులు అక్కడికి చేరుకోగానే ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉరేసుకుని దంపతుల ఆత్మహత్య
మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ మండలంలోని రాంనగర్ కాలనీలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. ఉరేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాంనగర్ కాలనీలో నివాసం ఉంటే లావణ్య, శ్రీనివాస్ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
కాగా, వీరి ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications