పెళ్లైన నెలకే ప్రియుడితో భార్య: తట్టుకోలేక భర్త ఆత్మహత్య

పెళ్లైన నెలరోజులకే కట్టుకున్న భర్తను వదిలేసి ప్రియుడితో పరారైంది ఓ యువతి. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌.

హైదరాబాద్: పెళ్లైన నెలరోజులకే కట్టుకున్న భర్తను వదిలేసి ప్రియుడితో పరారైంది ఓ యువతి. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి భర్త.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని చిలుకానగర్‌కు చెందిన కె యాకయ్య (31) ప్రైవేటు ఉద్యోగి. అతనిక గత జూన్‌ 18న మేడ్చల్‌కు చెందిన రవళి (22)తో వివాహం అయింది. కాగా, రవళి.. మూడు రోజులు మాత్రమే అత్తగారింట్లో ఉండి పుట్టింటికి వెళ్లింది. తర్వాత వచ్చినా జులై 21న ఇంటి నుంచి వెళ్లి పోయింది.

Wife eloped with her lover: husband committed suicide

అంతేగాక, వెళ్లేటప్పుడు 7 తులాల బంగారం, ఇతర ఆభరణాలను తీసుకెళ్లింది. బజారుకెళ్లి ఇంటికి రాకపోయే సరికి అదే రాత్రి భర్త యాకయ్య ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

కాగా, శనివారం రవళి.. భర్త యాకయ్యకు ఫోన్‌ చేసి తన ప్రియుడితో వెళ్లానని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు యాకయ్య. ఈ క్రమంలోనే అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యాకయ్య కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+