రోజూ అవే వేధింపులు, భార్య ఏం చేసిందంటే?

ఆదిలాబాద్: వేధింపులు భరించలేక రోకలి బండతో భర్త తలపై కొట్టి భార్య భర్తను హత్య చేసింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకొంది. మద్యానికి బానిసగా మారిన భర్త తరచూ వేధింపులకు గురిచేయడంతో , ఆ వేధింపులు తట్టుకోలేక ఆ భార్య రోకలిబండతో తల మీద బాది చంపేసింది.

మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన మోర్ల శ్రీనివాస్‌ను అతడి భార్య తన భార్య మోర్ల రాజేశ్వరి సోమవారం ఉదయం రోకలిబండతో కొట్టి హత్యచేసింది. మోర్ల రాజేశ్వరికి శ్రీనివాస్‌లకు 2005లో వివాహం జరిగింది. శ్రీనివా స్‌ అత్తగారి ఇంటికి ఇల్లరికంగా వచ్చారు. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. శ్రీనివాస్‌ మద్యానికి బానిస అయ్యాడు. ఆటో నడుపుతూ వచ్చిన డబ్బులతో మద్యం సేవించి భార్య రాజేశ్వరిని తరుచూ వే ధింపులకు గురిచేసేవాడు. రాజేశ్వరి తండ్రి కొట్రంగి లక్ష్మయ్య సింగరేణి రిటైర్డ్‌ కార్మికుడు. కాగా ఇటీవల రూ.2లక్షలను బ్యాంకులో డిపాజిట్ చేశారు.

wife kills her husband in Mancherial district

బ్యాంకులో ఉన్న డబ్బులు తనకు ఇవ్వాలని కోరడంతో భార్యభర్తల మధ్యన గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఆటోలు అమ్మిన శ్రీనివాస్‌ మళ్లీ కొత్త ఆటో కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వాలని మద్యం సేవించి భార్య రాజేశ్వరిని వేధించాడని ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా అతిగా మద్యం సేవించి భార్య రాజేశ్వరితో గొడవ పెట్టుకుంటున్నాడు.

ఈనేపథ్యంలో సోమవారం ఉదయం తాగి వచ్చిన శ్రీనివాస్‌ రాజేశ్వరితో గొడవకు దిగాడు. దీంతో రోకలిబండతో శ్రీనివాస్‌ తలపై బలంగా కొట్టింది. తీవ్ర రక్తస్రావంతో శ్రీనివాస్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్త వేధింపులు తాళలేక హత్య చేసినట్లు రాజేశ్వరి అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+