భర్తను చంపిన భార్య: అక్రమ లింక్ పేరుతో భార్య హత్య

Wife kills husband at Vanasthalipuram in Hyderabad
హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్య చేతిలో భర్త హతమయ్యాడు. ఈ సంఘటన హైదరాబాదులోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇంజాపూర్‌లోని బాలాజీనగర్‌లో శ్రవణ్ కుమార్, పావని దంపతులు నివాసం ఉంటున్ారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.

ఆదివారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో శ్రవణ్ కుమార్ భార్యను కొట్టాడు. దీంతో ఆగ్రహించిన భార్య తిరగబటి భర్త గొంతు నులిమింది. ఈ ఘటనలో శ్రవణ్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వైవాహికేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో..

తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నదని అనుమానించిన వ్యక్తి ఆమెను మురికిగుంతలో ముంచి అంతం చేశాడు. హైదరాబాదులోని సరూర్‌నగర్‌ మండలం మీర్‌పేట పంచాయతీ పరిధిలోని లెనిన్‌నగర్‌కు చెందిన జె.వెంకటేశ్‌ పెయింటర్‌. ఇతడి భార్య అమృత (42) నాదర్‌గుల్‌లోని ఓ టిఫిన్‌ సెంటర్‌లో వంట మనిషికి సహాయకురాలిగా పనిచేస్తుంది.

వెంకటేశ్‌ కొంతకాలంగా భార్యను అనుమానిస్తున్నాడు. లెనిన్‌నగర్‌లోనే నివసిస్తూ రాళ్లు కొట్టే పనిచేసే ఎస్‌.సత్యనారాయణతో సన్నిహితంగా ఉంటుందని గ్రహించాడు. దాంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శనివారం రాత్రి అమృత, సత్యనారాయణ (57)తో కలిసి మద్యం సేవిస్తుండడాన్ని వెంకటేశ్‌ గమనించాడు.

భార్యను లెనిన్‌నగర్‌ కట్టపై ఉన్న రక్త మైసమ్మ ఆలయం వద్దకు లాక్కొచ్చి పక్కనే ఉన్న మురికి (డ్రైనేజీ) కాలువలో పడేసి ముఖాన్ని మురుగు నీళ్లలో ముంచాడు. దాంతో ఆమె ఊపిరాడక మరణించింది. సమాచారమందుకున్న మీర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అమృత మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+