కులం తక్కువని!: భార్యను గెంటేసిన భర్త.. ఇంటిముందు యువతి ఆందోళన..

Subscribe to Oneindia Telugu

భూపాలపల్లి/తాడ్వాయి: ప్రేమించడానికి, పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని కులం.. ఆమెతో కాపురం చేయడానికి మాత్రం అడ్డు వచ్చింది. తక్కువ కులం అన్న కారణంతో భార్యను ఇంట్లో నుంచి గెంటివేశాడు. భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మండలంలోని బీరెల్లి గ్రామానికి చెందిన మంగ రజిత(22), అదే పంచాయితీ పరిధిలోని కామారం గూడానికి చెందిన బిక్షపతి(25) ప్రేమించుకున్నారు. భిక్షపతి యాదవ సామాజిక వర్గానికి చెందిన యువకుడు కాగా.. రజిత దళిత సామాజిక వర్గానికి చెందిన యువతి.

wife protest infront husband house in bhupalpally

కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు పెళ్లికి నిరాకరించాయి. అయినా పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు. ఆపై రెండు నెలలు కాపురం చేసిన తర్వాత భార్యను ఇంట్లో నుంచి పంపించేశాడు భిక్షపతి. కులం తక్కువ దానివి నా ఇంట్లో ఉండవద్దంటూ గెంటేయడంతో ఆమె దిక్కుతోచని స్థితిలో పడింది.

స్థానిక మహిళా సంఘాల సహాయంతో భర్త ఇంటి ముందు ఆందోళన చేపట్టింది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A wife staged infront husband house in Tadwai, Bhupalpally district for not allowing her into house

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి