టార్చర్ చేసిన భార్య.. హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకున్న భర్త!
జంబలకిడిపంబ సినిమా లాగా సీన్ రివర్స్ అయింది. మగవాళ్ళు ఆడవాళ్ళని హింసించడం పోయి, ఆడవాళ్లు మగవాళ్ళని హింసించే రోజులు వచ్చాయి. ఒకప్పుడు మగవాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆడవాళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళ వేధింపులు తట్టుకోలేక మగవాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు, మగవాళ్ళ పైన దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
భార్య వేధింపులు.. హుస్సేన్ సాగర్ లో దూకి భర్త సూసైడ్
తాజాగా భార్య వేధింపులకు మరొక నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుని పెట్టమని రెండు నెలలైనా గడవకముందే హుస్సేన్ సాగర్ లోకి దూకి సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్లోని లేక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకా వివరాలకు వెళితే,

అనారోగ్యాన్ని దాచి పెట్టి వివాహం.. ఆపై గొడవ
మృతుని బంధువులు చెప్పిన వివరాల ప్రకారం సంతోష్ అనే యువకుడు మే నెల 9వ తేదీన రామంతపూర్ కు చెందిన శారద అనే యువతని వివాహం చేసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న శారదను, ఆ విషయం చెప్పకుండానే ఆమె కుటుంబ సభ్యులు సంతోష్ కిచ్చి వివాహం చేశారు. ఇక సంతోష్ ఇంటికి వచ్చిన దగ్గరనుంచి ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడం గమనించి కుటుంబసభ్యులు శారద కుటుంబాన్ని నిలదీశారు.
భార్యాభర్తల మధ్య గొడవలు, భర్తకు వేధింపులు
ఇక అప్పటినుండి సంతోష్ కు శారద, ఆమె మేనమామలు, ఆమె కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. మానసికంగా సంతోష్ వేధించడం మొదలుపెట్టిన వారు చేస్తున్న టార్చర్ తట్టుకోలేక సంతోష్ సూసైడ్ చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భార్యాభర్తల మధ్య అనారోగ్య విషయాన్ని చెప్పకుండా దాచిన నేపథ్యంలో గొడవలు జరుగుతున్న క్రమంలో శారద జూన్ 4వ తేదీన ఆత్మహత్యాయత్నం చేసింది.
ఆ ఆధారాలున్నాయి.. వారిపై చర్య తీసుకోండి.. మృతుడి కుటుంబం డిమాండ్
దీంతో సంతోష్ ఆ తర్వాత రోజు నుంచి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆపై హుస్సేన్ సాగర్ లో శవమై తేలాడు అని సంతోష్ సోదరి, తల్లి చెబుతున్నారు. తమ తమ్ముడిని పెళ్లి చేసుకున్న నాటి నుంచి రకరకాలుగా వేధింపులకు గురి చేశారని, వారి వేధింపులకు సంబంధించిన ఆడియోలు, శారదకు సంబంధించిన అనారోగ్యం తాలూకా రిపోర్టులు తమ వద్ద ఉన్నాయని వారు చెబుతున్నారు. సంతోష్ ఆత్మహత్యకు కారణమైన వారిపైన కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications