ఓవైసీలకు పెద్ద కష్టం ? బీఆర్ఎస్ ఓటమితో సీన్ రివర్స్ ! కాంగ్రెస్సే దిక్కా ?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమి ఇప్పుడు అక్కడి రాజకీయ సమీకరణాల్ని మార్చేస్తోంది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ లో తన పట్టు నిలుపుకున్న బీఆర్ఎస్ ను నమ్ముకుని భవిష్యత్తులోనూ రాజకీయం చేసేందుకు మిత్రపక్షం ఎంఐఎం ప్రయత్నిస్తుందా లేక అధికార పార్టీల్ని సమర్దించే తన పాత సంప్రదాయాన్ని కొనసాగిస్తుందా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఓటమితో సైలెంట్ అయిపోయిన ఓవైసీలు ఏం చేయబోతున్నారు ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో అంటకాగడం మజ్లిస్ చరిత్ర. ఇందుకు అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ , ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ కూడా మినహాయింపు కాదు. అలాగే ఇందులో అధికారంలో ఉండగా ఆయా పార్టీలతో అంటకాగిన తర్వాత వారికి అధికారం పోతోందని తెలిస్తే ఏదో కారణంతో బురద జల్లేసి వారికి దూరంగా జరగడం కూడా ఎంఐఎం రాజకీయ వైఖరిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ తో మజ్లిస్ వ్యవహారం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

will asaduddin owaisi continue tradition of supporting ruling parties further?

ఎందుకంటే గతంలో ఉమ్మడి ఏపీలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ పాతబస్తీ వ్యవహారాల్లో కాస్త కఠినంగా వ్యవహరించడం, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ను జైలుకు పంపడం వంటి పరిణామాలతో ఆ పార్టీ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి కిరణ్ కుమార్ రెడ్డి వజ్ మై ఫ్రెండ్, జగన్మోహన్ రెడ్డి ఈజ్ మై ఫ్రండ్ అంటూ అసద్ చెప్పిన మాటలు ఎవరూ మర్చిపోరు. కానీ పరిస్దితి తారుమారై ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.

అదే సమయంలో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో అప్పటివరకూ తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా సమైక్య వాదం వినిపించిన ఓవైసీ కాస్తా యూటర్న్ తీసేసుకుని కేసీఆర్ కు జై కొట్టారు. అప్పటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోల్పోయే వరకూ ఓవైసీ-కేసీఆర్ స్నేహం కొనసాగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు నేపథ్యంలో రేవంత్ రెడ్డితో ఓవైసీ అమీతుమీ అన్నట్లుగా మారిపోయారు. రేవంత్ రెడ్డిది ఆరెస్సెస్ నేపథ్యం అంటూ ఓవైసీ ఆరోపిస్తే, ఆయన షేర్వాణీ కింద ఖాకీ నిక్కరు ఉందని రేవంత్ కౌంటర్ ఇచ్చారు.

ఇలా తెలంగాణ ఎన్నికల్లో ఉప్పూనిప్పుగా ఉన్న ఓవైసీ-రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావడంతో ఆ శత్రుత్వాన్ని కొనసాగిస్తారా లేక మజ్లిస్ తన రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ తో కలిసిపోతుందా అన్నది చూడాల్సి ఉంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించడం మొదలుపెట్టిన ఓవైసీ ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో సైతం ఆ పార్టీని దెబ్బతీసేందుకు బలం లేని చోట కూడా పోటీ చేసి ఓట్లు చీల్చారు. తద్వారా బీజేపీకి మేలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఓవైసీ దారెటు అన్నది చర్చనీయాంశమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+