వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? ఆ వీడియోతో టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం మొత్తం ఆసక్తికరంగా చూసిన మునుగోడు ఉప ఎన్నికల పోరు ముగిసింది. ఈ ఉప ఎన్నికలో హోరాహోరీగా పోరాడిన బిజెపి తరఫున బరిలోకి దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలయ్యారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయకేతనం ఎగురవేసి తన సత్తా చాటుకుంది. మొదటి నుంచి మునుగోడు ప్రజలు తనని ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికల ప్రచార సమయంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా తయారయ్యాయి.

 కోమటిరెడ్డి ఎప్పుడు నీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావ్.. ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు

కోమటిరెడ్డి ఎప్పుడు నీ రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావ్.. ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు

ప్రజలు తన కే పట్టం కడతారని, ఒకవేళ ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశాను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, మునుగోడులో కెసిఆర్ గెలిస్తే దేనికైనా రెడీ, రాజకీయ సన్యాసం తీసుకుంటానని వ్యాఖ్యలు చేయడంతో పాటు, మునుగోడు లో ఓడిపోతే రాజకీయాలు వదిలేసి ఫుల్ టైం బిజినెస్ చేసుకుంటానంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓటమి పాలు కావడంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి.. ఎప్పుడు రాజకీయాలకు రాజీనామా చేస్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

మునుగోడులో బీజేపీ ఓటమి

మునుగోడులో బీజేపీ ఓటమి

మునుగోడు ఉప ఎన్నిక అన్ని రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారగా, దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా, బిజెపి హోరాహోరీగా పోరాడి ఓటమిపాలైంది. ఇక ఈ ఎన్నికలో బిజెపి ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అయితే క్రాస్ ఓటింగ్ జరిగిందని, ఎన్నికల అధికారులు టిఆర్ఎస్ పార్టీకి వత్తాసు పలికారని, ప్రచారం ముగిసిన తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్థానికేతరులు ఉండి ఓటర్లను ప్రలోభ పెట్టాలని ఇలా రకరకాలుగా టిఆర్ఎస్ పార్టీపై బిజెపి ఆరోపణలు చేస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన మునుగోడు ప్రజలు తనకు ఓటు వేస్తారని ధీమాను వ్యక్తం చేశారు. ఈ ధీమాతోనే ఆయన, మునుగోడు లో తన విజయం పక్కా అని, ఒకవేళ మునుగోడులో ఓటమి పాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కోమటిరెడ్డి వ్యాఖ్యల వీడియో లను వైరల్ చేస్తూ టార్గెట్ .. ఆయన స్పందిస్తారా?

కోమటిరెడ్డి వ్యాఖ్యల వీడియో లను వైరల్ చేస్తూ టార్గెట్ .. ఆయన స్పందిస్తారా?

మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ చేతిలో ఓటమి పాలైన రాజగోపాల్ రెడ్డి మాటకు కట్టుబడతారా? చెప్పిన మాట ప్రకారం రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అంటూ టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం లో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక వీటిని టార్గెట్ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి రాజగోపాల్ రెడ్డి రాజకీయాలు వదిలేయాలని సూచిస్తున్నారు. మరి దీనిపై రాజగోపాల్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.

English summary
Will Komatireddy Rajgopal Reddy take political asceticism? Is he withdraw from politics? TRS is targeting in social media platform with the video of his speech during the election campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X