Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Huzurabad : హుజురాబాద్ బరిలో బీఎస్పీ...?-ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారా?-ఏం జరగబోతుంది...

తెలంగాణలో గత కొన్నాళ్లుగా రాజకీయ చర్చలన్నీ హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. సామాన్యుల చర్చల్లో సైతం ఉపఎన్నిక టాపిక్ ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన దళిత బంధు... హుజురాబాద్‌లో సంక్షేమ,అభివృద్ది పథకాలను పరుగులు పెట్టిస్తున్న తీరుపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ఇంతలా ఫోకస్ చేశారంటే ఓటమి భయం ఆయన్ను వెంటాడుతోందని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైతే గ్రౌండ్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ తర్జనభర్జనకు ఇంకా తెరపడలేదు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నికలో మరో పార్టీ పోటీకి సమాయత్తమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.బీఎస్పీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను హుజురాబాద్‌లో పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ శ్రేణులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రవీణ్ కుమార్‌ పోటీ చేయాలని ఒత్తిడి...

ప్రవీణ్ కుమార్‌ పోటీ చేయాలని ఒత్తిడి...

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవలే మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభతో రాజకీయాల్లోకి ప్రవీణ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న ప్రవీణ్‌ కుమార్‌ను హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేయాల్సిందిగా ఆ పార్టీ కీలక నేతలు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఎస్పీ సభ జరగనుంది. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు నేతలు బీఎస్పీలో చేరనున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసేది లేనిది ప్రవీణ్ కుమార్ ఆరోజు ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.

ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే సమీకరణాలు మారుతాయి...

ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే సమీకరణాలు మారుతాయి...

హుజురాబాద్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తే సమీకరణాలు మారిపోయే అవకాశం ఉంది. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల్లో ప్రవీణ్ కుమార్‌కు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో... ప్రజలు ఆయన వైపు ఆకర్షితులయ్యే అవకాశం లేకపోలేదు. ఇక్కడ దళితుల జనాభా దాదాపు 50వేల పైచిలుకు ఉంది. కాబట్టి ప్రవీణ్ గనుక ఇక్కడ పోటీకి సై అంటే టీఆర్ఎస్,బీజేపీలకు సవాల్ విసిరినట్లే అవుతుంది. నిజానికి ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసిన సందర్భంలో హుజురాబాద్‌లో పోటీపై పలు ఊహాగానాలు వినిపించాయి. అయితే నిర్ద్వంద్వంగా ఆయన వాటిని ఖండించారు. హుజురాబాద్‌లో పోటీ చేయట్లేదని స్పష్టం చేశారు.

బీఎస్పీ రిస్క్ చేస్తుందా...

బీఎస్పీ రిస్క్ చేస్తుందా...

హుజురాబాద్‌లో పోటీని ప్రజలు కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ గానే చూస్తున్నారనే విశ్లేషణలు ఉన్నాయి. అందుకే కాంగ్రెస్ సైతం ఒకానొక దశలో ఇక్కడ పోటీని లైట్ తీసుకుంటుందనే వాదన తెర పైకి వచ్చింది. ఇప్పటికీ ఆ పార్టీ ఇంకా అభ్యర్థి అన్వేషణలోనే ఉంది. అభ్యర్థిగా కొండా సురేఖ పేరు వినిపిస్తున్నప్పటికీ... అక్కడ పోటీ చేయడమంటే రిస్క్ చేయడమనే భావనలో సురేఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె పలు షరతులు కూడా పెట్టారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్‌ టికెట్‌ను మళ్లీ తనకే ఇవ్వడంతో పాటు వరంగల్ తూర్పు,పరకాల టికెట్లు తాము సూచించిన వ్యక్తులకే ఇవ్వాలని సురేఖ షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇలా ప్రధాన పార్టీ కాంగ్రెస్ అక్కడ పోటీ చేసేందుకు ఇంతలా తర్జనభర్జన పడుతున్న సమయంలో... బీఎస్పీ ఎంత మేర రిస్క్ చేస్తుందనేది చూడాలి.

ఆర్ఎస్పీ ఏం డిసైడ్ చేయబోతున్నారు...

ఆర్ఎస్పీ ఏం డిసైడ్ చేయబోతున్నారు...

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ చేరికతో బీఎస్పీకి కొత్త ఉత్సాహం వచ్చినట్లయింది. క్షేత్రస్థాయిలో యువత పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఇలాంటి తరుణంలో మొదటి అడుగు ఆచీ తూచీ వేయాలని ప్రవీణ్ కుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. హుజురాబాద్‌లో ఒకవేళ అంచనా తప్పితే... ఓటమి ముద్ర వెంటాడుతుంది. ఒకవేళ పోటీ చేసి గెలిస్తే మాత్రం బీఎస్పీకి భారీ మైలేజ్ రావడం ఖాయం. ఈ నేపథ్యంలో గ్రౌండ్ రియాలిటీని అంచనా వేస్తూ ప్రవీణ్ కుమార్ హుజురాబాద్‌లో పోటీపై ఆచీ తూచీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ప్రవీణ్ కుమార్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్,ఈటల...

ప్రవీణ్ కుమార్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్,ఈటల...

అటు కాంగ్రెస్,ఇటు బీజేపీ ప్రవీణ్ కుమార్‌ను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం. ఇటీవల ఈటల రాజేందర్ హుజురాబాద్ ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... 'మా ప్రవీణ్ కుమార్‌... మా ఆకునూరి మురళి...' అంటూ మాట్లాడారు. ఇటీవల రేవంత్ రెడ్డి సైతం మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ అంటూ ఆయనపై సానుకూల వ్యాఖ్యలు చేశారు. దీన్నిబట్టి ప్రవీణ్ కుమార్‌ పట్ల సానుకూలంగా వ్వవహరించడం ద్వారా రాజకీయ లబ్ది చేకూరే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ప్రవీణ్ కుమార్,ఆకునూరి మురళి... ఇద్దరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన గొంతుక వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల,రేవంత్‌ వారిని ఓన్ చేసుకునే ప్రయత్నం కనిపిస్తోంది.

విస్తృతంగా పర్యటిస్తున్న ప్రవీణ్ కుమార్

విస్తృతంగా పర్యటిస్తున్న ప్రవీణ్ కుమార్

ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశాక తెలంగాణవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. బీఎస్పీలో చేరాక జనంలోకి మరింతగా చొచ్చుకెళ్తున్నారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో యువతను పార్టీలోకి తీసుకొచ్చి పార్టీని బలోపేతం చేయడంపై ఫోకస్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని పటిష్టం చేసే పనిలో ప్రవీణ్ కుమార్ నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా ఫోకస్ చేసిన నేపథ్యంలో... హుజురాబాద్ ఉపఎన్నికలో ప్రవీణ్ కుమార్ పోటీ చేయకపోవచ్చుననే వాదన కూడా ఉన్నది. మరికొద్దిరోజుల్లోనే ఆయన స్టాండ్‌పై స్పష్టత వచ్చే అవకావం ఉంది.

బీసీలపై ప్రవీణ్ కుమార్ కామెంట్స్...

బీసీలపై ప్రవీణ్ కుమార్ కామెంట్స్...

నల్గొండ జిల్లాలోని దేవరకొండలో సోమవారం(ఆగస్టు 22) బీఎస్పీ ఆధ్వర్యంలో బీసీ కులాల చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీసీల స్థితి గతులపై మాట్లాడారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారంలో అతి తక్కువ వాటా ఉందన్నారు. దీన్ని తిరగరాయాలంటే బహుజన రాజ్యాన్ని స్థాపించాలని అభిప్రాయపడ్డారు.బహుజన రాజ్యంలోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.దేశంలో 99 శాతం సంపదను ఒక్క శాతం సామాజికవర్గాలు అనుభవిస్తున్నారని అన్నారు. బీసీ జనగణనకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించారు. నిజమైన లెక్కలు బయటకొస్తే... వాళ్ల దోపిడీ సాగదనే బీసీ జనాభా లెక్కలకు ఒప్పుకోవట్లేదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం జీవోలను దాచిపెట్టడాన్ని ఆయన ఖండించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+