ప్రధాని రాకకోసం పచ్చని చెట్లను నరుకుతారా.?గ్రీన్ ఇండియా,హరిత హారం లక్ష్యం అదేనా.?రేవంత్ ఫైర్.!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విధానాలపై టీపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సశ్యశ్యామలంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం లక్ష్యానికి ప్రభుత్వ పెద్దలే తూట్లు పొడుస్తున్నారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అంతేకాకుండా గ్రీన్ ఇండియా పేరుతో సెలబ్రిటీలందరికి ఛాలెంజ్ విసిరే ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కూడా ఈ అంశంలో ఎందుకు నోరు మెదపడం లేదని రేవంత్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

వేలాది చెట్లు నేలమట్టం..
శంషాబాద్ విమానాశ్రయం నుండి కూత వేటు దూరంలో ఉన్న రామానుజుల స్వామి కార్యక్రమం కోసం వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డు మార్గం కోసం వేలాది పచ్చని చెట్లను నరికి వేయడం ఎంతవరకు సమంజసమని రేవంత్ రెడ్డి ప్రశ్నిచారు. వచ్చేనెల ఐదో తారీఖున శ్రీ రామానుజుల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు చిన్నజియర్ స్వామి. దీనికి సమత విగ్రహం అని పేరుపెట్టారు. ఈ కార్యక్రమం కోసం దేశాద్యక్షుడు రామ్ నాథ్ కోవింద్ తో పాటు, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. అంతే కాకుండా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు.

ప్రకృతి విధ్వంసం..
ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందా లేక చిన్నజియర్ స్వామి వ్యక్తిగతంగా నిర్వమిచుకుంటున్నారా అనే సందేహం కలుగుతోందని, రామానుజుల స్వామి విగ్రహ ప్రతిష్టాపన ఏర్పాట్ల కోసం ప్రభుత్వంలోని అన్ని యంత్రాంగాలు పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. విగ్రహ ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందా ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు రేవంత్ రెడ్డి. రామానుజుల విగ్రహ ఏర్పాటును తాను వ్యతిరేకంచడం లేదని, విగ్రహ ఏర్పాటు మాటున జరుగుతున్న విధ్వంసాన్ని ప్రశ్నిస్తున్నాని రేవంత్ తెలిపారు.

రామానుజుల స్వామి విగ్రహ ఏర్పాటు అధికారిక కార్యక్రమమా.?
హరిత హారం పేరుతో ఏడాదికి కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పెరిగి స్వఛ్చమైన ఆక్సీజన్ ఇస్తూ కాలూష్యాన్ని తగ్గిస్తున్న క్రమంలో వేలాది చెట్లను తెగ నరకడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. ప్రధాని విమానాశ్రయంలో దిగి మరో హెలికాప్టర్ లో నేరుగా విగ్రహ కార్యక్రమానికి వెళ్లొచ్చని, అలా కాకుండా విమానాశ్రయం నుండి ముచ్చింతల వరకూ ప్రత్యేక రోడ్డు మార్గం కోసం అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ శాఖలన్నీ అక్కడే పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

రామానుజుల స్వామి, చిన్నజియర్ స్వాములంటే గౌరవం..
సుమారు వెయ్యి సంవత్సారాల క్రితం సమసమాజ స్థాపన కోసం, కుల రహిత సమాజం కోసం ఎంతో శ్రమించిని రామానుజుల స్వామి అంటే తనకు అపార గౌరవమని, చిన్నజియర్ స్వామి అన్నా తనకు ఎంతో అభిమానమని, కాని ప్రకృతిని విధ్వంసం చేసే హక్కు ఎవరిచ్చారని రేవంత్ ప్రశ్నించారు. వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు విచారణ సంస్థలను కూడా శాశిస్తున్నారని అన్నారు. పచ్చని చెట్లు, వృక్షాలను నరుకుతున్నా ప్రశ్నించే వ్యవస్థ లేకపోవడం శోచనియమన్నారు రేవంత్ రెడ్డి. వేకువ జామునుండి నిద్రించే వరకు సమాజానికి నీతులు చెప్పే చినజియర్ స్వామి ఈ అంశంలో స్పందించాలన్నారు రేవంత్ రెడ్డి.












Click it and Unblock the Notifications