హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: ఉరిశిక్ష వేయాలని.., ఏ శిక్ష ఐనా విధించుకోండి.. యాసిన్ భత్కల్

దిల్‌సుఖ్ నగర్ పేలుళ్ల నిందితులు అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఇజాజ్ షేక్‌లు ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్‌ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాఫ్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టులో తుది వాదనలు వినిపించింది. ఈ కేసులో ఇండియన్‌ ముజాహిద్దీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన ఐదుగురిని కోర్టు దోషులుగా ఇప్పటికే నిర్ధారించింది.

సేల్స్‌బాయ్ నుంచి బాంబు మేకర్: పాక్‌కు వెళ్తూ భార్యకు కాల్.. ఇదీ యాసిన్ భత్కల్.

దీనికి సంబంధించి ఈ రోజు (సోమవారం) కోర్టులో తుది తీర్పు వెలువడనుంది. తుది వాదనల సందర్భంగా దోషులకు మరణశిక్ష విధించాలని ఎన్ఐఏ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దేశాన్ని అస్థిరపరిచే చర్యలకు పాల్పడినందున వీరికి మరణశిక్షే సరైనదని ఎన్‌ఐఏ అభిప్రాయపడింది.

Will Yasin Bhatkal live or die? Special NIA court to decide today

శిక్షలకు సంబంధించి దోషుల అభిప్రాయాన్ని జడ్జి అడిగారు. చట్టపరంగా ఎలాంటి శిక్షకైనా తాము సిద్ధమని, దానిని అంగీకరిస్తామని దోషులు చెప్పడం గమనార్హం. నిందితులు అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఇజాజ్ షేక్‌లు ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.

English summary
The special NIA court had on Dec 13 convicted Yasin Bhatkal and four others after finding them guilty of carrying out the Dilsukhnagar blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X